Isha koppikar: ఏ రంగంలో అయినా సరే మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ సినిమా రంగంలో పనిచేసేవారు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వీరికి సంబంధించి ఏ చిన్న విషయం అయినా సరే ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది తమ జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కూడా బహిరంగంగా అందరితో పంచుకుంటున్నారు. ఇప్పుడు తాను కూడా టీనేజ్ వయసులో ఉన్నప్పుడే క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ తెలిపింది బాలీవుడ్ బ్యూటీ. అది కూడా 29 ఏళ్ల తర్వాత ఆ అనుభవాలను బయట పంచుకుంది. ఆమె ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ ఇషా కొప్పికర్ (Isha koppikar).
18 ఏళ్ల వయసులోనే ఇబ్బందులు ఎదుర్కొన్నా..
తొలి చిత్రంతోనే తెలుగులో భారీ పాపులారిటీ అందుకొని , ఆ తర్వాత టాలీవుడ్ కి దూరమైన హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఇండస్ట్రీకి దూరమైన ఈమె.. చాలా కాలంగా సినిమాలకు దూరంగానే ఉంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇషా కొప్పికర్ తనను ఒక స్టార్ డైరెక్టర్ ఒంటరిగా రమ్మన్నాడు అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇషా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” ఇండస్ట్రీలో నువ్వేం చేయగలవు అనేది ఎవరు చూడరు. హీరోయిన్స్ ఏం చేయాలనేది హీరోలే డిసైడ్ చేస్తారు. విలువలను నమ్ముతూ సినీ రంగంలో నిలదొక్కుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ భయంతో ఇండస్ట్రీకి దూరమైన అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు. 18 ఏళ్ల వయసులోనే నా దగ్గరకు ఒక నటుడు వచ్చి తనతో స్నేహంగా ఉంటేనే అవకాశాలు వస్తాయని చెప్పారు. సినీ రంగంలో చాలా మంది అసభ్యకరంగా తాకేవారు ఉన్నారు. అప్పట్లో ఒక స్టార్ హీరో నన్ను ఒంటరిగా రావాలని చెప్పాడు. ఆ తర్వాత డ్రైవర్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ లేకుండా కలవడానికి రావాలని ఇంకో డైరెక్టర్ చెప్పారు. ఇలా కొన్ని సందర్భాలలో హీరోలతో, డైరెక్టర్లతో ఖచ్చితంగా ప్రవర్తించాల్సి వస్తుంది. కానీ ఆ సమయంలో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి” అంటూ తన ఎదుర్కొన్న చేదు సంఘటనల గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది ఇషా కొప్పికర్.
ఇషా కొప్పికర్ కెరియర్..
ఈమె విషయానికి వస్తే.. ఇషా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగార్జున (Nagarjuna) హీరోగా నటించిన ‘చంద్రలేఖ’ సినిమాతో మంచి గుర్తింపు అందుకుంది. అందం, అభినయంతో కట్టిపడేసిన ఈమె, ఆ తర్వాత పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ కూడా చేసి ఆకట్టుకుంది. ఇక కెరియర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ప్రస్తుతం వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న ఈమె.. ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పి బాధపడింది. మొత్తానికైతే ఇషా ఎదుర్కొన్న ఇబ్బందులకు అభిమానులు.. ఇండస్ట్రీలోకి వచ్చే అమ్మాయిలు ఇలాంటి విషయంలో కచ్చితంగా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.