Rajinikanth: మనసు ఆహ్లాదంగా ఉంటే.. శరీరం దానంతటదే సహకరిస్తుంది అని నిరూపిస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth ). ముఖ్యంగా ఏదైనా చేయాలనే తపన ఉన్నప్పుడు వయస్సు అడ్డు రాదని చెబుతున్నారు. అందుకే 75 ఏళ్ల వయసుకు దగ్గరవుతున్న రజనీకాంత్.. ఈ వయసులో కూడా ఏ మాత్రం బ్రేక్ తీసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ.. అభిమానులను అలరిస్తున్నారు. ముఖ్యంగా ఈయన స్పీడ్ ను మ్యాచ్ చేయడం ఏ ఒక్క హీరోకి సాధ్యం కాదేమో.. ఒకేసారి రెండు మూడు సినిమాలు కమిట్ అవ్వడం, వీలైతే పార్లర్ గా రెండు సినిమాలను షూట్ చేయడం.. ఇలా కెరియర్లో ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నారు రజినీకాంత్.
75 ఏళ్ల వయసులో కూడా వరుస సినిమాలు ప్రకటిస్తున్న రజనీకాంత్..
ఇక ప్రస్తుతం వరుస సినిమాలు ప్రకటిస్తూ.. జెడ్ స్పీడులో దూసుకుపోతున్న రజనీకాంత్.. అదే స్పీడులో మరో క్రేజీ ప్రాజెక్టు జైలర్ 2(Jailer -2) షూటింగ్ కూడా మొదలు పెట్టేశారు వాస్తవానికి రజనీకాంత్ సినిమా కెరియర్ కాస్త డల్ గా మొదలైనప్పటికీ.. ఇప్పుడు బాక్సాఫీస్ ని బద్దలు కొట్టి, తన చరిష్మాని, క్రేజ్ ను , స్టామినాను చూపిస్తూ దూసుకుపోతున్నారు. మరోవైపు రజనీకాంత్ మార్క్ ఎలివేషన్ ఎక్కడ మిస్ చేయకుండా.. ఈ వయసులో కూడా ఆయన క్రేజ్ ఏంటో నిరూపించిన చిత్రం జైలర్(Jailer). యాక్షన్ కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ గా జైలర్ -2 పై కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అలాంటి సినిమా షూటింగ్ ఇప్పుడు ప్రారంభం అవ్వడమే కాకుండా.. సెట్ లోకి రజినీకాంత్ కూడా అడుగుపెట్టడంతో ఈ సినిమా నుంచి రాబోతున్న అప్డేట్స్ కూడా అభిమానులలో సరికొత్త ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఒకవైపు రజనీకాంత్ ‘కూలీ'(Coolie )సినిమా షూటింగ్లో బిజీగా ఉండగానే.. ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వకుండానే మరొకవైపు జైలర్ -2 సినిమా షూటింగ్ మొదలు పెట్టేశారు.
ఒకేసారి 2 సినిమాల షూటింగ్ లతో బిజీగా మారిన రజినీకాంత్..
లోకేష్ కనగరాజు (Lokesh Kanagaraju) దర్శకత్వంలో రజనీకాంత్ నెగిటివ్ షేడ్స్ తో ‘కూలీ’ సినిమా రాబోతోంది. ఇప్పటివరకు రజనీకాంత్ కెరియర్ లో రానటువంటి ఒక కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ లో రజనీకాంత్ కనిపించబోతున్నారు. ఇక మరొకవైపు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో.. జైలర్ 2 సినిమా చేస్తున్నాడు. ఇలా ఈ వయసులో కూడా.. అందులోనూ పార్లర్ గా రెండు యాక్షన్ చిత్రాలను చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ విషయం తెలిసి రజినీకాంత్ నిజంగా గ్రేట్ అంటూ పలువురు నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే జైలర్ 2 వచ్చే ఏడాది రిలీజ్ కానుండగా.. కూలీ మాత్రం ఈ ఏడాది సమ్మర్ లోనే విడుదల కాబోతోంది. ఇక ఈ కూలీ సినిమా విషయానికి వస్తే.. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున (Nagarjuna ) కీలక పాత్ర పోషిస్తున్నారు . అంతేకాదు ఈయన పాత్రకు సంబంధించిన ఒక చిన్న వీడియో కూడా వైరల్ గా మారింది. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న కూలీ సినిమా రజినీకాంత్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.