Bachhala Malli First Song: అల్లరి నరేష్ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఒకప్పుడు కామెడీ హీరోగా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న నరేష్.. నాంది సినిమాతో తన పంథా మార్చి సీరియస్ హీరోగా మారాడు. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీని తరువాత అలాంటి హిట్ కోసం నరేష్ ఎంతో శ్రమిస్తున్నాడు.
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం, ఆ ఒక్కటీ అడక్కు లాంటి సినిమాలు నరేష్ కు పరాజయాన్ని అందించాయి. ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన నా సామీ రంగా కొంతవరకు పర్వాలేదనిపించినా .. అదంతా నాగార్జున ఖాతాలోకి వెళ్ళిపోయింది. సోలో హీరోగా నరేష్ ఒక మంచి హిట్ కోసం కష్టపడుతున్నాడు. అందులో భాగంగానే నరేష్ మరో రా అండ్ రస్టిక్ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Khushbu Sundar: హీరో లైంగిక వేధింపులు.. సెట్ లోనే నా చెప్పు సైజ్ 41 అని చూపించాను
నరేష్, అమృత అయ్యర్ జంటగా నటించిన చిత్రం బచ్చలమల్లి. సుబ్బు మంగదేవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజేష్ దండా, బాలాజీ గుట్ట నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా బచ్చలమల్లి సినిమా నుంచి మొదటి సాంగ్ ను రిలీజ్ చేశారు.
అదే నేను అసలు లేను అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం మనసును హత్తుకుంటుంది. మెలోడీ సాంగ్స్ బ్రాండ్ అంబాసిడర్ అయిన విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. కృష్ణ కాంత్ లిరిక్స్ అందించగా.. ఎస్ పి చరణ్, రమ్య బెహరా ఈ సాంగ్ ను ఎంతో అద్భుతంగా ఆలపించారు. ముఖ్యంగా చరణ్ పాడుతుంటే ఎస్పీబి పాడినట్లే అనిపిస్తుంది.
మోహన్ బాబు@50.. ఆయన కెరీర్ బెస్ట్ సినిమాలు అంటే ఇవే
చదువురాని మాస్ హీరో.. చదువుకున్న క్లాస్ హీరోయిన్ తో ప్రేమలో పడడం, ఆమె వచ్చాక అతనిలో జరిగిన మార్పులు.. తొలిప్రేమ అనుభూతులు ఇలా మొత్తాన్ని ఈ సాంగ్ లో చూపించారు. ప్రేమకు కులం, గోత్రం, చదువు, డబ్బు ఇవేమి అడ్డు రావని ఈ సాంగ్ చూస్తుంటే అర్ధమవుతుంది. సాంగ్ మొత్తం వింటే.. గోదావరి సినిమాలోని మెలోడీ సాంగ్స్ గుర్తొచ్చిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో నరేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.