Redmi K80 Series Launch Date : టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ ను లాంఛ్ చేసే Redmi.. K80 సిరీస్ ను వచ్చే వారం చైనా మార్కెట్లోకి తీసుకురానుంది. Xiaomi సబ్ బ్రాండ్ అయిన రెడ్ మీ నుంచి ఈ K సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ రాబోతున్నాయని ఇప్పటికే ఆ సంస్థ తన అధికార వెబ్సైట్ లో తెలిపింది. Redmi K80 సిరీస్ మెుబైల్ డిజైన్స్ ను సైతం వెల్లడించింది. ఇక ఈ లైనప్ లో రెడ్‌మి కె80, కె80 ప్రో మెుబైల్స్ ఉన్నాయి. ఇక ఈ స్మార్ ఫోన్స్ Android 15 ఆధారిత HyperOS 2.0తో నడుస్తాయని…2K రిజల్యూషన్ డిస్‌ప్లేలను కలిగి ఉంటాయని తెలుస్తుంది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ గ్జియోమీ త్వరలోనే Redmi K80 సిరీస్ ను చైనాలో తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ ఫీచర్స్ తో వచ్చేస్తున్న ఈ మొబైల్స్ లాంఛ్ ఎప్పుడెప్పుడా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న టెక్ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్తూ తాజాగా గ్జియోమీ తన అధికార వెబ్సైట్లో ఈ మొబైల్స్ కు సంబంధించిన టీజర్ ను ఉంచింది. దీంతోపాటు మొబైల్ లాంఛ్ డేట్ సైతం వెల్లడించింది. ఈ మొబైల్స్ నవంబర్ 27న మార్కెట్లోకి రాబోతున్నాయని తెలిపింది.
గ్జియోమీ తాజాగా రెడ్మి k80 సిరీస్ ను తీసుకు రాబోతుంది. ఈ సిరీస్ లైనప్ లో రెండు మొబైల్స్ రాబోతున్నాయి. అవి Redmi K80, Redmi K80 Pro. ఇక ఇవి అధునాతన క్వాల్కమ్ 8 డ్రాగన్ ప్రాసెసర్ తో రాబోతున్నాయి. ట్రిపుల్ కెమెరా సెటప్, ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసే బ్యాటరీ, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో రాబోతున్నాయని వెల్లడించింది.
Redmi K80 Series (Redmi K80 సిరీస్ డిజైన్) –
Processor – Redmi K80 Pro మెబైల్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ తో రాబోతుంది. Redmi K80 స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 SoC చిప్ సెట్ తో రాబోతుంది. ఇక ఈ సిరీస్ మెుబైల్స్ Android 15 ఆధారిత HyperOS 2తో రాబోతుంది.
Camera – ఈ మెుబైల్స్ 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వచ్చేస్తుంది. ఇందులో ప్రైమరీ లెన్స్, అల్ట్రా వైడ్, టెలిఫోటో లెన్స్ ఉండనున్నాయి. ఇందులో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఫ్రెంట్ కెమెరా క్వాలిటీ సైతం హై రేంజ్ లో ఉండనున్నట్లు తెలుస్తుంది.
Display – రెడ్ మీ K80 సిరీస్ 120Hz రిఫ్రెష్ రేట్, మైక్రో కర్వ్డ్ OLED డిస్‌ప్లేతో రాబోతుంది. Redmi K80 మెుబైల్ 1.5K 120Hz OLED డిస్‌ప్లేతో రాబోతుంది.
Fast Charging – Redmi K80 Proలో 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో పాటు 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉండనుంది. ఇక రెడ్మీ K80 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 30W వైర్‌లెస్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.
Dust And Water Resistence – ఇక ఈ రెండు మొబైల్స్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో రాబోతున్నాయి. ఈ మొబైల్స్ లో హై క్వాలిటీ కెమెరాతో పాటు స్టోరేజ్ సదుపాయం సైతం వినియోగదారుల్ని ఆకట్టుకునే విధంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇక మిగిలిన ఫీచర్స్ ఏంటో తెలియాలి అంటే లాంఛింగ్ వరకు ఆగాల్సిందే.
ALSO READ : ఇక ప్రేమికులకు పండగే.. మనసులో మాటను చదివి వినిపించే వాట్సాప్ నయా ఫీచర్