Khushbu Sundar: ఇండస్ట్రీ .. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఎన్ని ప్రశంసలు దక్కుతాయో.. అన్నే విమర్శలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలో హీరోయిన్లకు లైంగిక వేధింపులు అనేది చాలా సాధారణంగా మారిపోయింది. అవకాశాలు ఇస్తామని కొందరు.. డబ్బు ఎరచూపి ఇంకొందరు, హీరోయిన్ చేస్తానని మరి కొందరు.. ఇలాంటి వేధింపులకు పాల్పడుతున్నారు.
ఒకప్పుడు హీరోయిన్స్ ఇలాంటి బెదింపుల బారిన పడ్డా కూడా బయటకు చెప్పేవారు కాదు. దాని వలన కెరీర్ పాడవుతుందని, తమను ఎదగనివ్వరని భయపడేవారు. కానీ, ఇప్పటి జనరేషన్ అలా లేదు. ఎవరైనా తమ వద్ద కొద్దిగా తప్పుగా ప్రవర్తించినా ఇచ్చిపడేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వారి బండారం బయటపెడుతున్నారు.
Rashmi Gautam : మెహందీ పెట్టుకున్న రష్మీ.. బ్లాస్టింగ్ న్యూస్ అంటూ పోస్ట్..
ఇక కొందరు సీనియర్ హీరోయిన్స్ మాత్రం.. సమయం దొరికినప్పుడు మాత్రం తాము గతంలో చవిచూసిన లైంగిక వేధింపుల ఘటనలను అందరి ముందుచెప్పుకొస్తారు. తాజాగా సీనియర్ నటి ఖుష్బూ కూడా తనకు ఎదురైన ఒక ఘటన గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం గోవాలో జరుగుతున్నా ఇఫీ 2024 వేడుకలకు ఖుష్బూ హాజరయ్యింది.
ఆ వేడుకల్లో భాగంగా ఆమె లైంగిక వేధింపుల గురించి, క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది ఖుష్బూ. లైంగిక వేధింపులు కేవలం ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా జరుగుతున్నాయని ఆమె తెలిపింది. ” లైంగిక వేధింపులు కేవలం ఇండస్ట్రీలోనే లేవు. బస్సులో, ట్రైన్స్ లో, ఇళ్లలో కూడా జరుగుతున్నాయి. వాటివలన మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాను.
మోహన్ బాబు@50.. ఆయన కెరీర్ బెస్ట్ సినిమాలు అంటే ఇవే
ఒక సినిమా సెట్ లో.. నేను షూటింగ్ చేస్తున్నా. ఒక హీరో నా దగ్గరకు వచ్చి వెకిలి నవ్వు నవ్వుకుంటూ.. ఏంటి మేడమ్ మాకు ఛాన్స్ ఏమైనా ఉందా.. ? అని అసభ్యకరంగా మాట్లాడాడు. నేను వెంటనే నా చెప్పు తీసి నా చెప్పు సైజ్ 41. చెంప పగులకొట్టమంటావా.. ? అని అందరి ముందు వార్నింగ్ ఇచ్చాను. దాంతో అతను అక్కడనుంచి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో నేను నా ఆత్మగౌరవం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను, నా కెరీర్ గురించి కాదు. స్త్రీలు ఆ సందర్భంలో పర్యవసానాల గురించి చింతించకుండా కష్ట సమయాలకు వ్యతిరేకంగా నిలబడాలి” అని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో ఖుష్బూను అంత పెద్ద మాట అన్న హీరో ఎవరు.. ? అని అభిమానులు ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఇక ప్రస్తుతం ఖుష్బూ జబర్దస్త్ కు జడ్జిగా వస్తున్న విషయం తెల్సిందే. అంతేకాకుండా పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ బిజీగా మారింది.