BigTV English

NBK 109 : బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మరో పోస్టర్ వచ్చేసింది..

NBK 109 : బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మరో పోస్టర్ వచ్చేసింది..

NBK 109 : నందమూరి హీరో బాలకృష్ణ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి NBK 109 మూవీ ఒకటి. డైరెక్టర్ బాబీ దర్శకత్వం లో ఈ సినిమా తెరకేక్కుతుంది.. ఈ సినిమా దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి తాత్కాలికంగా NBK109 అనే పేరు పెట్టారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ కి “సర్కార్ సీతారాం” అనే టైటిల్‌ ని పరిశీలించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్ లు సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన మోషన్ పోస్టర్ తో సినిమాకు బజ్ ఏర్పడింది.. ఈ మూవీని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. ఆ పోస్టర్ కు నెట్టింట అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.


బాలయ్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ NBK 109.. ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ బయటకు వచ్చింది. అయితే ఆఫీషియల్ గా ఆ పోస్టర్ ను రిలీజ్ చెయ్యలేదు. కానీ ప్రస్తుతం ఆ పోస్టర్ తెగ ట్రెండ్ అవుతుంది. ఆ పోస్టర్ లో బాలయ్య గుర్రం మీద కూర్చొని కనిపిస్తాడు. యోధుడు గా కనిపిస్తున్నాడు. ఆ పోస్టర్ బయటకు వచ్చిన క్షణాల్లోనే వైరల్ గా మారింది.. ఆ పోస్టర్ గురించి మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఆ పోస్టర్ లో బాలయ్య ఎలా ఉన్నాడో మీరు ఒకసారి చూసేయ్యండి..

ఈ మూవీ ఊర్వశి రౌటేలా, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, చాందిని చౌదరి, రిషి కీలక పాత్రలలో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించారు. ఇక ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల అయ్యేందుకు రెడీగా ఉంది. ఈ సినిమా నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ చాలా మంది ఈ చిత్రం గణనీయమైన విజయాన్ని పొందగలదని నమ్ముతున్నారు. ఇక ఈ మూవీ పూర్తి కాకుండానే మరో సినిమాను అనౌన్స్ చేశారు బాలయ్య.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమా చెయ్యనున్నారు. ఇటీవల ఈ మూవీని పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూట్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×