Daaku Maharaj 1st Day Collections: గత మూడేళ్లుగా నటసింహా నందమూరి బాలకృష్ణ(Balakrishna )నటిస్తున్న ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటోంది. గతంలో వచ్చిన ‘అఖండ’ సినిమా మొదలుకొని, ఇటీవల సంక్రాంతి బరిలో నిలిచిన ‘డాకు మహారాజ్’ సినిమా వరకు ప్రతి సినిమా కూడా మాస్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా బాలయ్య తన సినిమాలతో మరొకసారి అభిమానులను మెప్పించారు అని చెప్పవచ్చు. నిజానికి ‘అఖండ’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బాలకృష్ణ, ఆ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇటీవల వచ్చిన డాకు మహారాజ్ అన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. అయితే బాలయ్య తన సినిమాల ద్వారా ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఇద్దరు వ్యక్తులు అని, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది. అందులో ఒకరు బాలయ్య చిన్న కూతురు తేజస్విని (Tejaswini) కాగా , ఇంకొకరు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. ఎస్. తమన్(S.S Thaman).
బాలయ్య సక్సెస్ కి కారణం ఆ ఇద్దరే..
ముఖ్యంగా బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో లో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షో ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం తేజస్విని అని బాలకృష్ణ ఎన్నోసార్లు తెలియజేశారు. అటు తమన్ కూడా బాలయ్య సక్సెస్ కి కారణం అవుతున్నారు. అందులో భాగంగానే అఖండ సినిమా మొదలుకొని ఇప్పటివరకు వచ్చిన ప్రతి సినిమాకి చాలా అద్భుతమైన మ్యూజిక్ అందించారు. యాక్షన్స్ సన్నివేశాలకు తగ్గట్టుగా బిజిఎం అందిస్తూ బాలయ్య సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ ను అందిస్తున్నారు. ఇక ఇది చూసిన బాలయ్య అభిమానులు..” కోలీవుడ్లో రజనీకాంత్ కి బక్కోడు (అనిరుద్ రవిచంద్రన్ )ఉన్నాడు.. టాలీవుడ్ లో మా బాలయ్య బాబుకి బండోడు(తమన్)ఉన్నాడు” అంటూ కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే.
డాకు మహారాజ్ ఫస్ట్ డే కలెక్షన్స్..
ఇదిలా ఉండగా జనవరి 12వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటిరోజు ఎంత కలెక్షన్ వసూలు చేసింది అనే విషయం వైరల్ గా మారుతోంది. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఫస్ట్ డే ఎంత కలెక్షన్స్ వసూలు చేసింది అనే విషయాన్ని ఒక పోస్టర్ ద్వారా రివీల్ చేశారు మేకర్స్. అందులో భాగంగానే రూ.56 కోట్లకు పైగా కలెక్షన్ వసూలు చేసినట్లు మేకర్స్ పోస్టర్ తో సహా రిలీజ్ చేయడం జరిగింది. ఇకపోతే మొదటి రోజు రూ.56 కోట్లు అంటే.. ‘గేమ్ ఛేంజర్’ మూవీకి సగం దూరంలోనే ఆగిపోయిందని మెగా అభిమానులు కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
సగం కూడా రాబట్టలేకపోయిన డాకు మహారాజ్
ఇక రామ్ చరణ్ (Ram Charan)హీరోగా, శంకర్(Shankar )దర్శకత్వంలో వచ్చిన గేమ్ ఛేంజర్ . ఈ సినిమా మొదటి రోజు రూ.186 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ఇప్పుడు సగం కూడా ఈ సినిమా రాబట్ట లేకపోయిందని కామెంట్లు చేస్తుండగా.. బాలయ్య అభిమానులు మాత్రం ఆ సినిమా రూ.450 కోట్ల బడ్జెట్ తో వచ్చింది. కానీ ఈ సినిమా కేవలం రూ.100 కోట్లతో వచ్చింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా డాకు మహారాజ్ సినిమా కలెక్షన్స్ అటు అభిమానులను పూర్తిస్థాయిలో సంబరానికి గురి చేస్తున్నాయని చెప్పవచ్చు.