ICC – IPL 2025: క్రికెట్ ని ఎప్పటికప్పుడు ఆకర్షణీయంగా మార్చేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిరంతరం కొత్త రూల్స్ ని ప్రవేశ పెడుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ పై కన్నేసింది. తాజాగా ఐపీఎల్ లో ఐసీసీ నిబంధనలను అమలులోకి తీసుకురాబోతోంది. త్వరలోనే ఐపిఎల్ 2025 సీజన్ ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే.
Also Read: Yog Raj on Yuvraj Singh: గ్రౌండ్ లోనే యువీ చనిపోయినా గర్వపడేవాడిని !
అయితే ఐపీఎల్ లో ఆటగాళ్ల ప్రదర్శనతో పాటు ఆన్ ది ఫీల్డ్, ఆఫ్ ది ఫీల్డ్ లో ప్లేయర్స్ వ్యవహరిస్తున్న తీరుపై ఐసీసీ ప్రత్యేక దృష్టి సాధించింది. ఇప్పటివరకు జరిగిన 17 ఐపీఎల్ సీజన్లను దృష్టిలో పెట్టుకుని.. 2025 ఐపీఎల్ సీజన్ నుండి కొత్త కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు కానుంది. ఇకపై ఐపీఎల్.. ఐసీసీ ప్రవర్తన నియమావళిని అనుసరించనుంది. ఈ విషయాన్ని తాజాగా బీసీసీఐ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. అంటే మార్స్ 23 నుండి ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ 2025 సీజన్ లో.. నిబంధనలను ఉల్లంఘించిన ఆటగాడిపై అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాల మేరకు చర్యలు తీసుకోనున్నారు.
అంటే ఈ ఐపీఎల్ సీజన్ నుండి ఐసీసీ నియమావళిని అతిక్రమించిన ఆటగాళ్లకు జరిమాణాలు విధిస్తారు. లెవెల్ 1, 2 అలాగే 3 ని అతిక్రమించిన ఆటగాళ్లకు పెనాల్టీలు విధిస్తారు. ఇప్పటివరకు ఐపీఎల్ తన సొంత కోడ్ ఆఫ్ కండక్ట్ తో కొనసాగుతోంది. కానీ ఇకనుండి అలా కుదరదు. ఇకనుండి ఐపీఎల్ మ్యాచ్ లు ఐసీసీ, టి-20, ఇంటర్నేషనల్ మ్యాచ్ రూల్స్, రెగ్యులేషన్స్ ప్రకారం కొనసాగనున్నాయి.
ఈ విషయాన్ని ఐసీసీ జీసీ మెంటర్ తో ఓ ఐపీఎల్ పాలకవర్గ సభ్యుడు తెలియజేశారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ మార్చ్ 23 నుండి ప్రారంభం కాబోతుందని తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు రాజీవ్ శుక్ల వెల్లడించిన విషయం తెలిసిందే. మే 25వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుందని ఆయన తెలిపారు. బీసీసీఐ ప్రత్యేక సమావేశం ఆదివారం రోజు ముంబైలో జరిగింది.
ఈ సమావేశం అనంతరం రాజీవ్ శుక్ల మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 23 తేదీ నుండి ఐపీఎల్ ప్రారంభమవుతుందని తెలిపారు. అయితే ఆదివారం జరిగిన బీసీసీఐ సమావేశంలో.. బీసీసీఐ నూతన సెక్రటరీ, ట్రెజరర్ ఎన్నిక జరిగింది. బీసీసీఐ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన జై షా.. ఐసీసీ చైర్మన్ గా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జై షా స్థానంలో కొత్త కార్యదర్శిగా దేవజిత్ సైకియా, ట్రెజరర్ గా ప్రబ్ తేజ్ సింగ్ భాటియా ఎంపికైనట్లు బిసిసిఐ ఎస్జిఎం ఆదివారం సమావేశం అనంతరం తెలిపింది.
🗨️ “From now on, the ICC’s sanctioned penalties will be imposed for Level 1, 2, or 3 offenses. Until now, the IPL had its own Code of Conduct, but moving forward, Playing Conditions will align with ICC T20I regulations.”
– via 🏏 #IPL #Cricket #IPL2025 pic.twitter.com/YDckBLi8Lp
— Zain Cric (@Zain_Cric) January 13, 2025