Daaku Maharaj OTT..ఒకప్పుడు తన చిత్రాలతో భారీ పాపులారిటీ అందుకొని స్టార్ హీరోగా పేరు దక్కించుకున్నారు బాలయ్య (Balakrishna). ఇప్పుడు 6 పదుల వయసు దాటిన తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా మాస్ చిత్రాలకు పెట్టింది పేరుగా.. గాడ్ ఆఫ్ మాసేస్ గా పేరు తెచ్చుకున్న బాలయ్య తాజాగా నటించిన చిత్రం ‘డాకు మహారాజ్’. ఈరోజు 8 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా విడుదలయ్యింది. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ హక్కులను, ప్రముఖ ఇంటర్నేషనల్ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ (Netflix) డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.
డాకు మహారాజ్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఫిక్స్..
ఇకపోతే ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదలయ్యింది. అలాగే మరొకవైపు తమిళ , హిందీ వర్షన్ లను కూడా సిద్ధం చేశారు మేకర్స్. త్వరలోనే ఆయా భాషల్లో కూడా థియేట్రికల్ రిలీజ్ చేయడానికి మరొకవైపు ప్లాన్ చేస్తున్నారు. ఇక తెలుగుతోపాటు మిగతా భాషల్లో కూడా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..?
ఇదిలా ఉండగా సాధారణంగా ఒక సినిమా థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి స్ట్రీమింగ్ కి సిద్ధమవుతుంది. అది సినిమా యూనిట్ కి, అలాగే డీల్ కుదుర్చుకున్న ఓటీటీ నిర్వహకులకు మధ్య ఉన్న ఒప్పందాన్ని బట్టి సినిమా ఎప్పుడు ఓటీటీలోకి రావాలి అనేది నిర్ణయించబడుతుంది. ఒకవేళ ఈ సినిమా అదే థియేటర్లలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని.. హౌస్ ఫుల్ థియేటర్లతో రన్ అయితే మాత్రం ఇంకొన్ని వారాలు ఆలస్యం అవుతుంది అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమా ఫలితాన్ని బట్టి.. ఓటీటీ లోకి ఎప్పుడు రాబోతుంది? అనే విషయాన్ని త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ కూడా వెల్లడించారు.
డాకు మహారాజ్ సినిమా విశేషాలు..
ఇక డాకు మహారాజ్ సినిమా విషయానికొస్తే.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ యువనిర్మాత , సితార ఎంటర్టైన్మెంట్ అధినేత సూర్యదేవర నాగ వంశీ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) సతీమణి సాయి సౌజన్య (Sai sowjanya )నిర్మించారు. ఈ సంస్థలో రూపొందించిన సూపర్ హిట్ సినిమాలు కొన్నింటిని నెట్ ఫ్లిక్స్ ఓటీటీ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ డాకు మహారాజ్ ఓటీటీ హక్కులు కూడా సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఇందులో బాలకృష్ణ సీతారామ్ పాత్రలో నటించారు. ఆయనకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal)నటించింది. మరొకసారి వీరి జోడికి మంచి మార్కులే పడ్డాయని చెప్పవచ్చు. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ‘అఖండ’ సినిమా వచ్చి సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఇక ఇప్పుడు మరొకసారి వీరి కాంబినేషన్లో విడుదలైన ఈ సినిమాకి కూడా యూఎస్ ఆడియన్స్ పాజిటివ్ రెస్పాన్స్ అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో మరొక హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ (Shraddha shrinath) కూడా నటించింది. అలాగే బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్ తో పాటూ ఒక కీలకమైన సన్నివేశంలో కూడా నటించింది. ఇక ఇందులో బాబీ డియోల్, రవికిషన్, నితిన్ మెహతా వంటి వారు కూడా విలన్స్ గా నటించారు. ఇక ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు.