Venkatesh: హీరోలు కూడా అప్పుడప్పుడు మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకోవడం కోసం కొన్ని ప్రయోగాలు చేస్తుంటారు. అందులో ఒకటి పాటలు పాడడం. యంగ్ హీరోలు అయినా, సీనియర్ హీరోలు అయినా.. చాలావరకు వారి కెరీర్‌లో ఒక్కసారి అయిన పాట పాడే ఉంటారు. అలాగే విక్టరీ వెంకటేశ్ కూడా ముందుగా తను హీరోగా నటించిన ‘గురు’ సినిమాలో ఒక పాట పాడారు. ఆ పాటలో వెంకటేశ్ వాయిస్‌పై చాలానే ట్రోలింగ్ జరిగింది. కానీ మెల్లగా ప్రేక్షకులే ఆ పాటను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మరోసారి ‘సంక్రాంతికి వస్తున్నాం’లో పాట పాడారు. అదే పాటను స్టేజ్‌పై పర్ఫార్మ్ చేసి అందరిలో జోష్ నింపారు వెంకటేశ్.
బ్లాక్‌బస్టర్ పొంగల్
అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబినేషన్ అనేది సూపర్ డూపర్ హిట్ అని ఇప్పటికే ప్రేక్షకులకు అర్థమయ్యింది. అందుకే ఈ కాంబోలో హ్యాట్రిక్ సినిమా రాబోతోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలయిన టీజర్, ట్రైలర్స్ చూస్తుంటే ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ టీమ్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. ఆ ఈవెంట్‌లో వెంకటేశ్ నేరుగా పాట పాడి అందరినీ అలరించడం హైలెట్‌గా నిలిచింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’లో ‘బ్లాక్‌బస్టర్ పొంగల్’ అనే పాట పాడారు వెంకటేశ్. అదే పాటను ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్‌పై పర్ఫార్మ్ చేసి చూపించారు.
Also Read: మరోసారి బాధితురాలిగా మారిన హనీ రోజ్.. ఆ కేసు వల్ల భారీ ఎఫెక్ట్
అందరూ హ్యాపీ
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్‌తో కలిసి ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్‌పై పాట పాడారు వెంకటేశ్. దీంతో డైరెక్టర్, యాక్టర్స్ అందరిలో జోష్ పెరిగి స్టేజ్‌పైకి వచ్చి స్టెప్పులేశారు కూడా. దాని తర్వాత ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా గురించి, అనిల్ రావిపూడి గురించి మాట్లాడారు వెంకటేశ్. ‘‘నేను హీరోలాగా కాకుండా ప్రొడ్యూసర్‌గా ఆలోచిస్తాను. ఈ సినిమా కోసం పనిచేసిన అందరికీ మనస్పూర్తిగా థాంక్యూ. అనిల్ మంచి స్క్రిప్ట్‌తో వచ్చాడు. అందరికీ నచ్చుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. నిర్మాతలు చాలా హ్యాపీ ఫీలవుతారని అనుకున్నాను. నా ఫ్యాన్స్‌కు కూడా ఇలాంటి సినిమాలు అంటే ఇష్టం. ఇది చెప్పకపోతే మళ్లీ ప్రాబ్లమ్ అవుతుంది. ఐశ్వర్య, మీనాక్షి చాలా బాగా చేశారు’’ అంటూ కూల్‌గా స్పీచ్ ఇచ్చారు వెంకీ మామ.
సంక్రాంతికి హిట్
అనిల్ రావిపూడి (Anil Ravipudi), వెంకటేశ్ (Venkatesh) కాంబినేషన్‌లో ఇప్పటికే ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ సినిమాలు వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ సాధించాయి. ప్రతీసారి వీరి కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమాను సంక్రాంతికి విడుదల చేసి హిట్ కొడుతున్నారు. ఈసారి కూడా అలాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తోనే మరోసారి సంక్రాంతికి రావాలని డిసైడ్ అయ్యారు. ఈ పండగకు పలు భారీ చిత్రాలు విడుదల అవుతున్నా కూడా ఫ్యామిలీతో కలిసి సరదాగా వెళ్లి నవ్వుకునే సినిమా ఏదైనా ఉంది అంటే.. అది ‘సంక్రాంతికి వస్తున్నాం’ మాత్రమే అని ఆడియన్స్ ఫీలవుతున్నారు.
. @VenkyMama vibing is a pure vintage vibe . Ah energy endi ra saami 🙏💥.
Trendy music ivvadam lo Bheems tarvate ippudu . Talk okate balance run mathram F2 range untadi pakka. #SankranthikiVasthunam #Venkatesh #Venkateshdaggubati pic.twitter.com/Y3TOHdchhG— 𝙽𝚒𝚝𝚝𝚞.𝙼𝙱.𝙲𝙱𝙽🦸🏻♂️ (@Niteesh__09) January 11, 2025