BigTV English
Advertisement

NBK 109 Movie Update : ఒక్క పోస్టర్ తో మాస్ బీభత్సం.. వయోలెన్స్ కా విజిటింగ్ కార్డ్..

NBK 109  Movie Update : ఒక్క పోస్టర్ తో మాస్ బీభత్సం.. వయోలెన్స్ కా విజిటింగ్ కార్డ్..

NBK 109 Movie Update : నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన భగవంత్ కేసరి.. ఈ దసరా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రికార్డుల పై రికార్డులు సృష్టించి.. బాలకృష్ణకు భారీ విజయాన్ని అందించింది. ఈ జోష్ ని కంటిన్యూ చేస్తూ ఈ ఆరుపదుల హీరో నెక్స్ట్ తన 109 చిత్రాన్ని షురూ చేస్తున్నాడు. ఈ మూవీకి యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి.. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు బాలయ్య.


మార్కెట్లో బాలయ్య గిరాకి ఇంతగా పెరగడానికి ముఖ్య కారణం ఆహాలో చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో. గతేడాది సంక్రాంతికి వీర సింహారెడ్డి చిత్రంతో బరిలోకి దిగాడు. ఈసారి దసరాకు భగవంత్ కేసరి మూవీలో తన వయసుకు తగిన పాత్రలో నటించాడు. ఇక ఈ చిత్రంలో శ్రీలీల, బాలయ్య ఫైట్ సీన్ అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీలో గుడ్ టచ్..బ్యాడ్ టచ్ గురించి బాలయ్య చెప్పిన పాఠం విమర్శకుల ప్రశంసలను అందుకుంది.

బాలయ్య బర్త్ డే సందర్భంగా బాబీతో 109 సినిమాకి శ్రీకారం చుట్టగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నాగ వంశీ ఈ మూవీ నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఒక పవర్ఫుల్ సాలిడ్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది అనడానికి సంకేతంగా ఈ పోస్టర్ ను విడుదల చేశారు.


చేతిలో గొడ్డలి.. కళ్ళకు రేబాన్ కళ్ళజోడు.. ఒక్క పోస్టర్ తోనే సాలిడ్ కంటెంట్ అని చెప్పకనే చెబుతున్నారు మూవీ మేకర్స్. బాలయ్య సినిమా అంటే పవర్ఫుల్ మాస్ డైలాగ్స్ దగ్గర నుంచి నెత్తురు చిమ్మే ఫైట్స్ వరకు ఒక కంప్లీట్ యాక్షన్ ప్యాకేజీలాగా ఉంటుంది. మరి ఈ చిత్రంలో ఫైట్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి. షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమాను సంక్రాంతి బరిలోకి దింపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే సంక్రాంతి సంబరాలకు అరడజను చిత్రాలతో సై అంటే సై అంటున్నాయి. ఇప్పుడు బాలయ్య బరిలోకి దిగితే ఇక థియేటర్లలో పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. ప్రభాస్ ప్రాజెక్ట్ K, రవితేజ ఈగల్, మహేష్ గుంటూరు కారంకు పోటీగా బాలయ్య 109 బరిలోకి దిగనుంది అని నందమూరి అభిమానులు తెగ ఖుషీ అయిపోతున్నారు. ఈ మూవీలో బాలయ్య సరసన నయనతార మరోసారి హీరోయిన్ గా నటిస్తుందని టాక్. అయితే మరోపక్క ఈ మూవీలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ పేరును కూడా వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×