BigTV English

Glenn Maxwell : బ్యాలెన్స్.. టెన్నిస్.. గోల్ఫ్.. మాక్స్ వెల్ మ్యాజిక్ రహస్యం ఇదేనా..!

Glenn Maxwell : బ్యాలెన్స్.. టెన్నిస్.. గోల్ఫ్.. మాక్స్ వెల్ మ్యాజిక్ రహస్యం ఇదేనా..!

Glenn Maxwell : గ్లెన్ మాక్స్ వెల్ సంచలన ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా ని సెమీస్ లోకి ప్రవేశించేలా చేసింది. ఒంటికాలితో వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన మాక్స్ వెల్ డబుల్ సెంచరీ చేసి ఆస్ట్రేలియాను ఓటమి నుంచి విజయ తీరాలకు చేర్చాడు.


ముంబై వాంఖడే మైదానంలో జరిగిన ఆస్ట్రేలియా ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ క్రీడాభిమానులకు కన్నులవిందుగా నిల్చింది. ప్రతి ఒక్కరిని టీవీల ముందు అతుక్కుపోయేలా చేసింది. 292 పరుగుల టార్గెట్ ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తడబడింది. 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పొయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో మాక్స్ వెల్ కి కెప్టెన్ పాట్ కమ్మిన్స్ తోడయ్యాడు. ఒక పక్కన మాక్స్ వెల్ విధ్వంసం సృష్టిస్తుంటే పాట్ కమ్మిన్స్ అతనికి చూడముచ్చటైన సహకారం అందించాడు. సెంచరీ పూర్తి చేసుకున్న మాక్స్ వెల్ తొడ కండరాల గాయం తో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడి ఆఫ్ఘన్ ఆశలపై నీళ్లు చల్లాడు.

ఇదిలా ఉండగా మాజీ క్రికెటర్లు, క్రీడాభిమానులు, అనలిస్టులు ఈ ఇన్నింగ్స్ ను గొప్పగా వర్ణిస్తున్నారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ అయితే మాక్స్ వెల్ ని గోల్ఫ్ టెన్నిస్ క్రీడాకారుణిగా అభివర్ణించాడు. ఆ షాట్స్ కేవలం మాక్స్ వెల్ కు మాత్రమే సొంతం అని.. ఇలాంటి ఇన్నింగ్స్ ఎన్నడూ చూడలేదని ఆయన తెలిపారు. మాక్స్ వెల్ బాల్యంలో అనేక క్రీడలు ఆడాడని వసీం అక్రమ్ తెలిపాడు. మాక్స్ వెల్ కేవలం క్రికెట్ కాకుండా .. గోల్ఫ్ .. టెన్నిస్ లాంటివి ఆడటం వలన ఈ టెక్నిక్స్ తన అమ్ముల పొదిలో అస్త్రాలులా మారిపోయాయని అక్రమ్ అభివర్ణించాడు.


ఇక పాక్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ అయితే ఈ ఇన్నింగ్స్ ను ఆల్ టైం గ్రేట్ గా అభివర్ణించాడు. గోల్ఫ్ క్రీడాకారులకు మాత్రమే సాధ్యమయ్యే షాట్స్ ని మ్యాక్సీ అద్భుతంగా ఆడాడని అన్నాడు.
ఇక షోయబ్ మాలిక్ సైతం ఈ ఇన్నింగ్స్ ను గొప్పగా వర్ణించాడు. ఒంటికాలితో మ్యాక్సీ చేసిన పోరాటం ఎంతోమందికి స్ఫూర్తి అని ఆయనను కొనియాడారు. ఆఫ్ఘన్ బౌలర్లలో అనుభవం కొరవడిందని మాలిక్ అన్నారు. క్యాచెస్ వొదిలేయడం వాళ్ళ భారీ మూల్యం చెల్లించుకున్నారని ఈ హైదరాబాద్ అల్లుడు అభిప్రాయపడ్డాడు.

https://twitter.com/1Sabina000/status/1722144815876362378?s=20

Related News

IND vs BAN: పసికూన బంగ్లాదేశ్ పై పంజా…ఆసియా కప్ ఫైనల్స్ కు టీమిండియా..ఇంటికి శ్రీలంక

IND vs BAN: త‌డ‌బ‌డిన టీమిండియా…బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే ?

Abhishek Sharma: అభిషేక్ కొంప‌ముంచిన సూర్య‌.. క‌ష్టాల్లో టీమిండియా, సంజూకు బ్యాటింగ్ ఇవ్వ‌క‌పోవ‌డంపై ట్రోలింగ్‌

India vs Bangladesh: టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌…బ్యాటింగ్ ఎవ‌రిదంటే

Vaibhav Suryavanshi : 41 సిక్సుల‌తో చెల‌రేగిన వైభ‌వ్‌..ఆస్ట్రేలియా దారుణ ఓట‌మి

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Big Stories

×