Pragya jaiswal : నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna )హీరోగా నటించిన అఖండ (Akhanda)సినిమాలో హీరోయిన్ గా నటించింది ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal). బోయపాటి శ్రీను(Boyapati Sreenu)దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ప్రగ్యాకి అవకాశాలు వరుసగా తలుపుతడతాయని అందరూ అనుకున్నారు. కానీ “ఎక్కడ వేసిన గొంగళి అక్కడే” అన్నట్టు ఆమె పరిస్థితి మారిపోయింది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు విషయాలను పంచుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తాజాగా క్రికెటర్ తో డేటింగ్ చేయాలని ఉంది అంటూ మనసులోని మాట చెప్పి బాంబ్ పేల్చింది. అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం.
అవకాశాలు లేక సోషల్ మీడియాకే పరిమితం..
తెలుగు – తమిళ్ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ‘డేగ’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది ప్రగ్యా జైస్వాల్. తమిళ్ ,తెలుగు తో పాటు హిందీలో కూడా అరంగేట్రం చేసిన ఈమె, మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత క్రిష్ (Krish)దర్శకత్వంలో వచ్చిన ‘కంచె’ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకుంది. ఇందులో తన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినా.. అనుకున్నంత స్థాయిలో గుర్తింపు లభించలేదు. దీంతో సినిమాలతో పాటు యాడ్స్ కూడా చేసి బుల్లితెర ఆడియన్స్ను మెప్పించాలనుకుంది. కానీ అక్కడ కూడా పెద్దగా సక్సెస్ అయినట్టు కనిపించలేదు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ.. యువతకు నిద్ర లేకుండా చేస్తోంది.
క్రికెటర్ తో డేటింగ్ చేయాలని ఉంది..
ఈ క్రమంలోనే తాజాగా ఒక స్టార్ క్రికెటర్ తో డేటింగ్ చేయాలని ఉంది అంటూ తెలిపింది.ఇంతకూ ఆ క్రికెటర్ ఎవరో కాదు యంగ్ క్రికెటర్ శుభమాన్ గిల్(Shubman gil) తో డేటింగ్ చేయాలనుకుంటున్నట్లు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది. ఇదిలా ఉండగా గతంలో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కూతురు సారా టెండూల్కర్ (Sara Tendulkar) తో శుభమన్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ జంట మీడియా కంట కూడా పడింది. కానీ ఇప్పుడు ప్రగ్య ఇలాంటి కామెంట్లు చేయడంతో ఈ విషయం కాస్త అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి దీనిపై శుభమాన్ గిల్ ఏదైనా స్పందిస్తారేమో చూడాలి.
ప్రగ్యా జైస్వాల్ కెరియర్..
ఇక ప్రగ్యా జైస్వాల్ విషయానికి వస్తే.. హీరోయిన్ గానే కాకుండా ఫెమినా మిస్ ఇండియా 2008 పోటీల్లో పాల్గొని మిస్ ఫ్రెష్ ఫేస్ గా టైటిల్ గెలుచుకుంది. ఆ తరువాత మిస్ డాన్సింగ్ క్వీన్, మిస్ ఫ్రెండ్ ఆఫ్ ఎర్త్ వంటి టైటిల్స్ సొంతం చేసుకుంది. అంతేకాదు డవ్, డాబర్ వాటిక, రిలయన్స్ డిజిటల్, ఎఫ్ బిబి, మిలీనియం హైపర్ మార్కెట్ ఫర్ దుబాయ్ వంటి ఎన్నో పాపులర్ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా కూడా పనిచేసింది. ఇక మధ్యప్రదేశ్లోని జబల్పూర్ లో జన్మించిన ఈమె, పూణేలోని సింబయాసిస్ లో లా స్కూల్ పూర్తి చేసింది. అలా చదివేటప్పుడే అందాల పోటీల్లో పాల్గొని, మోడల్ గా మారింది. ఇకపోతే 2014 జనవరి 22వ తేదీన సింబయాసిస్ సాంస్కృటిక్ పురస్కారం కూడా అందుకుంది.