Balakrishna:నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna)..ప్రస్తుతం యంగ్ డైరెక్టర్స్ తో పనిచేస్తూ.. భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. గత రెండు మూడేళ్లుగా యంగ్ డైరెక్టర్లకే అవకాశం ఇస్తున్న బాలయ్య.. అందుకు తగ్గట్టుగానే భారీ విజయాలను సొంతం చేసుకుంటూ స్టార్ స్టేటస్ ను అందుకుంటున్నారు. ఇదిలా ఉండగా బాలయ్య తన వ్యక్తిగత జీవితంలో కొన్ని నియమాలు పాటిస్తారట.అంతేకాదు ఈ రకమైన అలవాట్లు ఉన్న టాలీవుడ్ ఏకైక హీరో కూడా ఆయనే అని వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో? బాలయ్యకు వున్న ఆ అలవాట్లు ఏంటో? ఇప్పుడు చూద్దాం.
అద్భుతమైన అలవాట్లు కలిగి వున్న హీరోగా గుర్తింపు..
ఈ ఏడాది సంక్రాంతికి వరుసగా నాలుగో హిట్టు కొట్టిన నందమూరి బాలకృష్ణ, తాజాగా ‘పద్మభూషణ్’ అవార్డుకి కూడా ఎంపికైన విషయం తెలిసిందే. అలాగే ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే’ అనే టాక్ షో తో కూడా దూసుకుపోతున్నారు. ఈ షోతో హోస్ట్ గా సక్సెస్ అయినా.. అటు రాజకీయపరంగా కూడా మరింత విజయాన్ని చవిచూస్తున్నారు. అందులో భాగంగానే హిందూపురం ఎమ్మెల్యేగా మూడవసారి కూడా బాధ్యతలు చేపట్టారు. ఇదంతా చూస్తూ ఉంటే బాలయ్యకే ప్రస్తుతం మహర్దశ నడుస్తోంది అన్నట్లు అనిపిస్తోంది. ఆయన పట్టిందల్లా బంగారమే అవుతుందని చెప్పవచ్చు. ఇకపోతే బాలయ్య తన లైఫ్ లో కొన్ని నియమాలు పాటిస్తారట. షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా, ఎంత లేటుగా షూటింగ్ ముగించుకొని ఇంటికి వచ్చినా.. ప్రతిరోజు ఉదయం 3:30 గంటలకు నిద్ర లేవడం, బాలయ్యకు అలవాటట. నిద్రలేవగానే భూమాతకు నమస్కరించి, ఆ తర్వాత పాదాలు నేలపై పెడతారట. ఇక తర్వాత స్నానం చేసి సూర్యోదయంలోపే పూజ కూడా చేసుకుంటారట. బాలయ్యకి దైవభక్తి ఎక్కువే. భగవంతుడి కోసం కూడా సమయం కేటాయిస్తారు. ఆయన కోసం సమయం కేటాయిస్తే , మనకోసం మనం టైం కేటాయించుకున్నట్లే అని బాలయ్య చెబుతూ ఉంటారు. అందుకే ప్రతిరోజు పూజకి సమయం కేటాయిస్తారట బాలయ్య.
టాలీవుడ్ లో అలాంటి ప్రతిభ కలిగిన ఏకైక హీరో..
ముఖ్యంగా బాలకృష్ణకి తెలుగు పద్యాలు , సంస్కృతంలో కూడా మంచి పట్టు ఉంది. చిన్నతనంలోనే తెలుగు మాస్టర్ దగ్గర ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారు. ఈ ప్రతిభ కలిగిన అతి కొద్ది మంది తెలుగు హీరోలలో బాలయ్య కూడా ఒకరు. ఈయనకి మాస్ ఇమేజ్ తీసుకొచ్చి, ఆయన స్టైల్ ను పూర్తిగా మార్చేసిన సినిమా ‘రౌడీ ఇన్స్పెక్టర్’. ఇకపోతే తన కెరియర్ లో ఎన్నో గొప్ప చిత్రాలలో నటించిన ‘సమరసింహారెడ్డి’ సినిమాకి తిరుగులేదని, తన చిత్రాలలో సమరసింహారెడ్డి సినిమా అంటే తనకు చాలా ఇష్టం అని కూడా తెలిపారు బాలకృష్ణ. అంతేకాదు ఆయనకు ఆహారం విషయంలో ఎలాంటి నియమాలు ఉండవట. అన్నీ తింటారట. సినిమా కోసం అవసరమైతే స్వల్పంగా డైట్ కూడా మెయింటైన్ చేస్తారట. ఇక ఆయనకు కలిసి వచ్చే నెంబర్ 9 అని, కలిసి రాని వారం ఆదివారం అని, కలిసి రాని రంగు నలుపు అని, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.