Janhvi Kapoor: సాధారణంగా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు.. ఒక సినిమా హిట్ అవ్వగానే ఎక్కువ యాడ్స్ చేయడానికి ఇష్టపడతారు. దానికి కారణం వారి క్రేజ్ ను ప్రపంచానికి చూపించవచ్చు అని.. అందులోనూ డబ్బుకు డబ్బు కూడా వస్తూ ఉంటుంది. ఒక ప్రోడక్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ.. బాగా సంపాదించనివారు కూడా ఉన్నారు. అయితే చాలామంది స్టార్స్ ఏ యాడ్స్ కు అయినా ఒప్పుకుంటారు కానీ, కండోమ్ యాడ్స్ కు ఒప్పుకోరు. దానికి చాలా ధైర్యం కావాలి. సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వొచ్చు, కండోమ్ యాడ్స్ చేస్తే ఎక్కువ అలాంటి సినిమాలే రావచ్చు.. ఇలా చాలా కారణాలు ఉన్నాయి. అందుకే ఏ స్టార్ కూడా వెంటనే కండోమ్ యాడ్ కు ఒప్పుకోరు.
ఇక బాలీవుడ్ నుంచి సన్నీ లియోన్, శోభితా ధూళిపాళ్ల, కార్తీక్ ఆర్యన్, రణ్ బీర్ కపూర్ లాంటివారు మాత్రమే కండోమ్ యాడ్స్ లో నటించారు. ఇక ప్రస్తుతం మ్యాన్ కైండ్ సంస్థకు చెందిన కండోమ్స్ మ్యాన్ ఫోర్స్ ప్రోడక్ట్ కు కార్తీక్ ఆర్యన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. అంతకుముందు ఇదే ప్రోడక్ట్ కు సన్నీ లియోన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది.
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మ్యాన్ కైండ్ సంస్థ అధినేత రాజీవ్ జునేజా.. ఒకవేళ కండోమ్ యాడ్ కు మరొక లేడీ బ్రాండ్ అంబాసిడర్ ను తీసుకోవాల్సి వస్తే తాను జాన్వీ కపూర్ ను తీసుకుంటాను అని చెప్పడం సంచలనంగా మారింది.
” మ్యాన్ ఫోర్స్ ప్రోడక్ట్.. మగవాళ్ల గురించి ఆలోచించి చేసింది కాబట్టి కార్తీక్ ఆర్యన్ ను తీసుకున్నాం. అతను కాకుండా ఆడవారిలో ఎవరైనా అంటే.. జాన్వీ కపూర్ బెస్ట్ ఛాయిస్. ఆమె చాలా బాగా కనిపిస్తుంది. కానీ, ఆమె సంతకం చేయలేదు. ఇక మగవారిలో ఇంకొకరు అయితే రణబీర్ కపూర్ బావుంటాడు.
Vijay Antony: పరాశక్తి.. నా టైటిల్ కొట్టేశారు.. ఆధారాలతో సహా చూపించిన స్టార్ హీరో
ఇక యంగ్ హీరోల్లో అయితే కిల్ మూవీ ఫేమ్ లక్ష్య కూడా బావుంటాడు. ఇక ప్రెగ్నెన్సీ కిట్ యాడ్ కోసం అనుష్కశర్మ, దీపికా పదుకొనే అయితే బావుంటుంది.. కానీ దీపికా రెమ్యూనరేషన్ మేము తట్టుకోలేం. ఆమె అడిగినంత మేము ఇవ్వలేము” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇప్పటివరకు ఈ వ్యాఖ్యలుపై జాన్వీ స్పందించలేదు.
ఇక జాన్వీ కెరీర్ గురించి చెప్పాలంటే.. బాలీవుడ్ లో బిజీ హీరోయిన్స్ లో జాన్వీ ఒకరు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. తెలుగులో దేవర సినిమాతో అడుగుపెట్టిన జాన్వీ.. మొదటి సినిమాతోనే తన అందంతో కుర్రకారును తన గుప్పిట్లో పెట్టేసుకుంది. ఇక దేవర సినిమా తరువాత జాన్వీ.. RC16 లో నటిస్తోంది.
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దేవర సినిమాలో ఈ చిన్నదాని పాత్ర చాలా తక్కువ ఉండడంతో ఆమె నటన అంతగా బయటకు రాలేదు. మరి ఈ సినిమాతో జాన్వీ తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.