Mokshagna Teja.. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మూల స్తంభమైన స్వర్గీయ నందమూరి తారక రామారావు (Sr.NTR) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నందమూరి బాలకృష్ణ అతి తక్కువ సమయంలోనే భారీ మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఒకవైపు హీరోగా వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న ఈయన ఇంకొకవైపు రాజకీయ నేతగా కూడా చలామణి అవుతున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా ఏకంగా మూడుసార్లు శాసనసభకు ఎంపికై హ్యాట్రిక్ కొట్టారు బాలయ్య. హిందూపురం ప్రజలను సొంత మనుషులుగా చూసుకుంటూ వారికి కావాల్సిన అన్ని అవసరాలను తీరుస్తున్నారు. ముఖ్యంగా అక్కడి ప్రజల కోసం ప్రత్యేక అంబులెన్స్ తో పాటు అవసరమైన వారికి సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉంటారు. అందుకే హిందూపురం బాలయ్యకు కంచుకోటగా మారింది.
వారసుడి కోసం కష్టాలు పడుతున్న బాలయ్య..
ఇదిలా ఉండగా మరోవైపు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఇటీవల 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈయనను చిత్ర పరిశ్రమ ఘనంగా సత్కరించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇప్పటికే చాలామంది స్టార్ హీరోల వారసులు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంటుంటే.. బాలయ్య వారసుడి ఎంట్రీ కోసం అభిమానులు దాదాపు 5 సంవత్సరాలు ఎదురు చూశారు. కానీ ఎట్టకేలకు ఈ ఏడాది సెప్టెంబర్ 6వ తేదీన బాలయ్య వారసుడు మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా ఆయన మొదటి మూవీని అనౌన్స్ చేయడం జరిగింది. హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న ప్రశాంత్ వర్మ (Prashanth Varma) ఈ సినిమాను టేక్ ఓవర్ చేసుకోవడం గమనార్హం. మోక్షజ్ఞ మొదటి ఎంట్రీ కోసం చాలామంది దర్శకులను పరిశీలించిన బాలయ్య, చివరికి ప్రశాంత్ వర్మను ఫైనల్ చేసినట్లు వార్తలు వినిపించాయి.
మోక్షజ్ఞ సరసన బాలీవుడ్ స్టార్ కిడ్..
మరోవైపు ప్రశాంత్ వర్మ కూడా.. మోక్షజ్ఞ లాంచ్ కోసం పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. అందుకే హీరోయిన్ విషయంలో కూడా ఏమాత్రం వెనుకడుగు వేయలేదని తెలుస్తోంది. బాలయ్య స్థాయికి తగ్గట్టుగా మోక్షజ్ఞ సరసన స్టార్ సెలబ్రిటీల వారసురాలినే ఎంపిక చేశారు. ఎట్టకేలకు రవీనా టాండన్ (Raveena Tandon)కూతురు రాషా (Rasha)ను మోక్షజ్ఞ సరసన హీరోయిన్ గా ఎంపిక చేశారు. అయితే ఈ హీరోయిన్ సెలక్షన్ వెనుక చాలా కథ జరిగిందని సమాచారం.
మోక్షజ్ఞ కోసం 30 మంది హీరోయిన్లు రిజెక్ట్..
బాలయ్య తన కొడుకును పాన్ ఇండియా హీరోగా లాంచ్ చేయడం కోసం ఏకంగా రూ.100 కోట్లు బడ్జెట్ కేటాయిస్తున్న విషయం తెలిసిందే. తొలి హీరోగా అడుగుపెడుతున్న మోక్షజ్ఞ పై భారీ నమ్మకంతోనే ఈ రేంజ్ లో బడ్జెట్ పెట్టినట్లు సమాచారం. అందుకే ప్రతి అంశంపై కూడా చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారట అందులో భాగంగానే దాదాపు 30 మంది కొత్త హీరోయిన్స్ ని ఆడిషన్ చేయగా అందులో ఎవరు కూడా పర్ఫెక్ట్ గా అనిపించకపోవడంతో ఆ 30 మందిని రిజెక్ట్ చేయాల్సి వచ్చిందని సమాచారం. దీంతో కాస్త పరిచయం వుండి , నటనకు ప్రాధాన్యత ఇవ్వాలి అని భావించిన దర్శకుడు ఈ చిత్రానికి హిందీలో కూడా మంచి మార్కెట్ ఉండాలనే నేపథ్యంతో బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ కుటుంబం నుంచి వారసురాలిని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. ఏది ఏమైనా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కోసం బాలకృష్ణ భారీగా ప్లాన్ చేస్తున్నారని చెప్పవచ్చు.