Balakrishna – Vasundhara Devi: నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna) కెరియర్ విషయంలో ఫుల్ స్వింగ్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అటు సినిమాపరంగా ఇటు రాజకీయపరంగా వరుస సక్సెస్ లు అందుకుంటూ బిజీగా మారిపోయారు. ఆరు పదుల వయసు దాటినా వరుస సినిమాలు ప్రకటిస్తూ.. ఎంతో మంది యంగ్ హీరోలకు కూడా పోటీగా నిలుస్తున్నారు. అటు ఆహాలో అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తూ, బ్లాక్ బాస్టర్ గా నిలిచారు. ఇకపోతే బాలయ్య వృత్తిపరమైన జీవితంలోనే కాదు వ్యక్తిగతంగా కూడా సక్సెస్ అయ్యారు. దీనికి కారణం ఆయన సతీమణి వసుంధరా దేవి అని, ఎప్పుడు ఆయన చెబుతూనే ఉంటారు. ఇకపోతే ఈరోజు బాలకృష్ణ వసుంధర దేవిల పెళ్లిరోజు. ఈరోజుతో వీరి వైవాహిక బంధానికి అక్షరాల 42 సంవత్సరాలు.
కూతుళ్ళను సెటిల్ చేసిన దంపతులు..
ఇన్నేళ్లు ఈ జంట ఇంత అన్యోన్యంగా జీవించడానికి కారణం వారిద్దరి మధ్య అండర్స్టాండింగ్ అని ఎన్నో సందర్భాలలో బాలకృష్ణ చెప్పిన విషయం తెలిసిందే. బాలకృష్ణ, వసుంధర దేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలతో పాటు కుమారుడు కూడా ఉన్నారు. పెద్ద కుమార్తె బ్రాహ్మణి(Brahmani)ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి లోకేష్ కి భార్యగా వెళ్లగా, చిన్న కుమార్తె తేజస్విని(Tejaswini) విశాఖ ఎంవిబిఎస్ మూర్తి గారి మనవడైన మొతుకుమిల్లి శ్రీ భరత్ ను వివాహం చేసుకున్నారు. ఇకపోతే కూతుర్లిద్దరూ కూడా కెరియర్ లోనూ అటు వైవాహిక బంధం లోనూ వెను తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. అంతలా ఇద్దరి కూతుర్లకు మంచి భవిష్యత్తును ప్రసాదించారు ఈ జంట. ఇకపోతే కొడుకు మోక్షజ్ఞ (Mokshagna)వెండితెరపై ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.
బాలకృష్ణ – వసుంధరా దేవి పెళ్లి కార్డు వైరల్..
ఇకపోతే 1982 డిసెంబర్ 8వ తేదీన బాలకృష్ణ, వసుంధరా దంపతుల పెళ్లి జరిగింది. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ శుభలేఖ నవంబర్ 22వ తేదీన ప్రచురణకు వెళ్లినట్టు అక్కడ డేట్ కూడా వేశారు. ముఖ్యంగా ఈ శుభలేఖను పెళ్లి కుమార్తె అయిన వసుంధరా ఫ్యామిలీ వాళ్ళు వేయించింది కావడం గమనార్హం. కాకినాడ వాస్తవ్యులైన దేవరపల్లి సూర్యరావు, దేవరపల్లి ప్రమీల రాణి దంపతుల ద్వితీయ కుమార్తెను.. భాగ్యనగరం వాస్తవ్యులైన పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు పంచమ పుత్రుడికి ఇచ్చి వివాహం చేస్తున్నట్టు ఆ పత్రికలో తెలిపారు. ఎనిమిదవ తేదీ పగలు 12:41 నిమిషాలకు ముహూర్తాన్ని నిర్ణయించారు. దీన్ని బట్టి చూస్తే బాలయ్య పెళ్లి పగులు జరిగిందని తెలుస్తోంది. అంతేకాదు వీరి పెళ్లి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కర్ణాటక కళ్యాణ మండపంలో జరిగింది. ఇక పెళ్లి జరిగి 42 సంవత్సరాల కావస్తున్నా.. ఇంకా దీనినే తమ జ్ఞాపకంగా దాచుకున్నారు ఈ జంట ఇక అది కాస్త బయటకు రావడంతో వైరల్ గా మారింది. వసుంధరా దేవి తండ్రి సూర్యారావు.. శ్రీరామదాసు మోటార్ ట్రాన్స్పోర్ట్ అధినేత కావడం గమనార్హం.