Hero Darshan Case: ఒక స్టార్ హీరో.. ఒక సామాన్యుడి మర్డర్ కేసులో నిందితుడిగా జైలుకు వెళ్లడం అనేది అసలు సినీ చరిత్రలోనే ఎప్పుడూ జరిగుండదేమో. అలాంటిది కన్నడ స్టార్ హీరో దర్శన్ (Darshan).. రేణుకా స్వామి (Renuka Swamy) అనే వ్యక్తి మర్డర్ కేసులో ప్రధాన నిందితుడిగా తేలడంతో పాటు కోర్టు నుండి జైలు శిక్షను కూడా తీర్పులాగా అందుకున్నాడు. ప్రధాన నిందితుడు అయినా కూడా ఏదో ఒక విధంగా బయటికి రావాలని బెయిల్ కోసం ప్రయత్నాలు చేశాడు. మొత్తానికి తనకు ఆరోగ్యం బాలేదని, సర్జరీ అవసరమని కారణం చూపించి బెయిల్ తీసుకున్నాడు. మొత్తానికి ఈ బెయిల్ విషయంలో కోర్టు ఒక నిర్ణయానికి రానుంది. దర్శన్ బెయిల్ క్యాన్సల్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
కండీషన్స్ పాటించలేదు
దర్శన్ జైలుకు వెళ్లిన తర్వాత ఎన్నో విధాలుగా తనకు బెయిల్ తీసుకురావాలని లాయర్స్ ప్రయత్నించినా అది కుదరలేదు. మొత్తానికి తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని కారణం చెప్పి బెయిల్ వచ్చేలా చేశారు. అక్టోబర్ 30న దర్శన్ తనకు 6 వారాల కండీషనల్ బెయిల్ అందించింది. ఆ 6 వారాల్లోనే 3 వారాలలోపే దర్శన్ సర్జరీ చేయించుకొని, ఆ తర్వాత రెస్ట్ తీసుకోవాల్సి ఉంది. కానీ తను అలా చేయలేదు. సర్జరీ చేయడంతో దర్శన్ బీపీ కంట్రోల్‌లోకి వస్తుందని లాయర్ చెప్పి బెయిల్ అడిగారు. అది నిజమే అనుకొని కోర్టు తనకు బెయిల్ మంజూరు చేసింది. కానీ దర్శన్ మాత్రం బెయిల్ తర్వాత సర్జరీ విషయమే మర్చిపోవడంతో కోర్టు తనపై సీరియస్‌గా ఉంది.
Also Read: యస్.. వాళ్లు కొట్టుకున్నారు.. సంచలనం రేకెత్తిస్తున్న పోలీసుల ఫుల్ రిపొర్ట్
సాక్షులను టాంపర్
కోర్టు కండీషన్స్‌ను దర్శన్ పక్కన పెట్టారని, సర్జరీ విషయంలో ఆయన రూల్స్ పాటించలేదని అధికారులు చెప్తున్నారు. అంతే కాకుండా సాక్షులను టాంపర్ చేశారనే ఆరోపణలు కూడా దర్శన్‌పై వచ్చాయి. దీంతో కర్ణాటక ప్రభుత్వం తనపై చాలా సీరియస్‌గా ఉంది. దీన్ని బట్టి చూస్తే సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు తమ ఇన్‌ఫ్లుయెన్స్‌తో ఎలా తప్పించుకోగలరో అని తెలుస్తుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఒకవేళ దర్శన్ నిజంగానే తన రూల్స్‌ను ఉల్లంఘించాడని నిరూపణ అయితే తనను వదిలేది లేదని అధికారులు అంటున్నారు. ఎంత ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్న మనుషులు అయినా కోర్టు శిక్ష వేస్తుందని చూపిస్తామని సీరియస్ అవుతున్నారు.
ఆరోజే నిర్ణయం
డిసెంబర్ 9న దర్శన్ కండీషనల్ బెయిల్ పూర్తికానుంది. అదే రోజు తనపై ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలని కోర్టు తీర్పు ఇవ్వనుంది. రేణుకా స్వామి మర్డర్ కేసులో దర్శన్ నిందితుడని తేలినా.. జైలు శిక్ష అనుభవిస్తున్నా కూడా ఇప్పటికీ చాలామంది ఫ్యాన్స్ తను తప్పు చేయలేదని నమ్ముతున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో దొరికిన ఆధారాలు అన్నీ కూడా దర్శన్ నిందితుడని తెలిసేలా చేస్తున్నాయని పోలీసులు తెలిపారు. రేణుకా స్వామి అనే వ్యక్తి తనకు అసభ్యకర మెసేజ్‌లు పంపించడంతో సహనం కోల్పోయిన దర్శన్.. కొందరు ఫ్యాన్స్‌తో తనను హత్య చేయించాడని ఆరోపణలు వచ్చాయి. అది నిజమే అని తెలిసేలా పోలీసులకు పలు ఆధారాలు కూడా దొరికాయి.