Vande Bharat Train Engine: వందేభారత్ రైలు గురించి పెద్దగా పరిచయం అససరం లేదు. 2019లో పట్టాలు ఎక్కిన ఈ అత్యాధునిక సెమీ హై స్పీడ్ రైలు ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. అత్యధిక వేగంతో పాటు అద్భుతమైన సౌకర్యాలతో అద్భుతమైన ప్రయాణ అనుభూతిని కలిగిస్తున్నది. రోజు రోజుకు అప్ డేట్ అవుతూ మెరుగైన సేవలను అందిస్తున్నది. త్వరలో వందేభారత్ స్లీపర్, వందేభారత్ మెట్రో రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. మరోవైపు సరుకు రవాణా కోసం వందేభారత్ పార్శిల్ రైళ్లను కూడా తయారవుతున్నాయి. ఆధునిక భారతీయ రైల్వే వ్యవస్థకు ముఖచిత్రంగా మారిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ లోని ఇంజిన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ట్రెడిషనల్ లోకోమోటివ్ ఇంజన్ లా కాకుండా ప్రొపల్షన్ సిస్టమ్ ఆధారంగా ముందుకు దూసుకెళ్తుంది. అత్యంత అధునాతన పవర్ తో శరవేగంగా ముందుకు సాగుతున్నది.
ఇంతకీ ప్రొపల్షన్ సిస్టమ్ ఎలా పని చేస్తుందంటే?
⦿ డిస్ట్రిబ్యూటెడ్ ట్రాక్షన్ సిస్టమ్:
వందేభారత్ రైలు సంప్రదాయ రైల్లో మాదిరిగా ముందు, వెనుక ప్రత్యేక ఇంజిన్లను(లోకోమోటివ్)ను కలిగి ఉండదు. ఇది డిస్ట్రిబ్యూటెడ్ ట్రాక్షన్ సిస్టమ్ తో రన్ అవుతుంది. ప్రతి కోచ్ కు స్వంత ఎలక్ట్రిక్ ట్రాక్షన్ మోటార్ ఉంటుంది. ఇది అవసరమైన ప్రొపల్షన్ ను అందిస్తుంది. సాధారణంగా ఈ రైలుకు చివర్లో రెండు వపర్ కార్లు ఉంటాయి. ఇందులోని మోటార్లు రైలును అత్యంత వేగంగా తీసుకెళ్లడానికి సాయపడుతాయి.
⦿ విద్యుత్ విద్యుత్ సరఫరా:
వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు విద్యుత్తుతో నడుస్తుంది. ఓవర్ హెడ్ లైన్ల ద్వారా పవర్ సరఫరా చేయబడుతుంది. ఈ రైలులో విద్యుత్‌ను గ్రహించేందుకు పాంటోగ్రాఫ్ లు అమర్చబడి ఉంటాయి. అవి రైలు ట్రాక్షన్ సిస్టమ్ కు శక్తిని అందిస్తాయి. ఫలితంగా రైలు ముందుకు కదులుతుంది.
Read Also: గంటకు 1000 కిమీల వేగం.. ఈ రైలు పట్టాలపై నడవదు!
⦿ అద్భుతమైన డిజైన్ డిజైన్:
వందేభారత్ రైలులో సంప్రదాయ పెద్ద లోకోమోటివ్ లా కాకుండా చాలా స్మార్ట్ గా ఉంటుంది. చివరి కార్లలోనే ఇంజన్లు (ట్రాక్షన్ మోటార్లు) కలిగి ఉంటుంది. చూడ్డానికి స్మార్ట్ గా కనిపించడంతో పాటు సమర్థవంతంగా పని చేస్తాయి. ఇవి సాంప్రదాయ రైళ్లతో పోలిస్తే తక్కువ బరువు, ఎక్కువ పవర్ ను, ఆకర్షణీయమైన డిజైన్ ను కలిగి ఉంటాయి. వీల్స్ మధ్య తక్కువ మెకానికల్ భాగాలు ఉన్నందున పవర్ వేస్టేజ్ చాలా తక్కువగా ఉంటుంది.
⦿ లేటెస్ట్ టెక్నాలజీ:
వందే భారత్ ఎక్స్ ప్రెస్ అత్యాధునిక నియంత్రణ వ్యవస్థను కలిగి ఉంటుంది. కచ్చితమైన పర్యవేక్షణతో పాటు వీల్స్ కు సమర్థవంతంగా పవర్ పంపిణీ జరుగుతుంది. రైలు డిజైన్ పవర్ వినియోగాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది. అందుకే, ఈ రైలు కొద్ది క్షణాల్లోనే అత్యంత వేగాన్ని అందుకుంటుంది. ఈ రైలు గరిష్టంగా గంటకు 160 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. సో.. వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు సాంప్రదాయ లోకోమోటివ్ లేనప్పటికీ, శక్తివంతమైన ట్రాక్షన్ సిస్టమ్ తో అత్యంత వేగంగా దూసుకెళ్తుంది.
Read Also: ట్రయల్ రన్ కు రెడీ అవుతున్న వందే భారత్ స్లీపర్ ట్రైన్, ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!