Akhanda 2: నందమూరి బాలకృష్ణ (Balakrishna) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు. ఒకానొక సమయంలో కథల ఎంపిక విషయంలో బాలయ్య తడబాటు పడటంతో అనుకున్న స్థాయిలో సినిమాలు సక్సెస్ అందుకోలేకపోయాయి కానీ, ఇటీవల కాలంలో మాత్రం తన వయసుకు తగ్గ పాత్రలను ఎంపిక చేసుకుంటూ బాలయ్య ప్రేక్షకుల ముందుకు వస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తున్నారు. అఖండ సినిమా నుంచి మొదలుకొని బాలకృష్ణ నటించిన లెజెండ్, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వందకోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టాయి.
హ్యాట్రిక్ కాంబినేషన్..
ఇలా బాలయ్య సినిమాలు వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో బాలయ్య కూడా ఎంతో ఉత్సాహంతో సరికొత్తగా, విభిన్నమైనటువంటి కథ చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక బాలకృష్ణ బోయపాటి శ్రీను (Boyapati Sreenu)కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే చాలు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తుందనే విషయం తెలిసిందే. ఇప్పటివరకు బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలో అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇక మరోసారి ఇద్దరి కాంబినేషన్లో అఖండ 2(Akhanda 2) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాని ఈ ఏడాది చివరన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ పై ఫోకస్…
ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి ఇటీవల టీజర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ కు అద్భుతమైన ఆదరణ లభించింది. కేవలం దక్షిణాది రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ఉత్తరాది రాష్ట్రాలలో కూడా ఈ సినిమాని భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ చూస్తుంటే మాత్రం ఈ సినిమా ఈసారి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఈ సినిమా భారీ స్థాయిలో బిజినెస్ జరుపుకుంటున్న ఈ సినిమా బిజినెస్ కేక్ వాలా లాగా సాగిపోతుందని చెప్పాలి.
ఇలా ఈ సినిమాకు ఏర్పడిన బజ్ చూస్తుంటే మాత్రం సినిమాకి ఎవరు ఎంత నెగెటివిటీ క్రియేట్ చేసిన మాత్రం కలెక్షన్లను ఆపటం ఎవరి తరం కాదని తెలుస్తుంది.. ఇక ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో నిర్మాతలు బాలీవుడ్ బిజినెస్ పై కూడా పూర్తిస్థాయిలో ఫోకస్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా నటి సంయుక్తమీనన్ (Samyuktha Menon)నటించబోతున్నారు. ఇక ఈ సినిమాని 14 ప్లస్ రీల్స్ బ్యానర్ పై గోపి అచంట, రామ్ ఆచంట నిర్మించగా నందమూరి తేజస్విని సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.బాలయ్య సినిమాకు తన కుమార్తె నందమూరి తేజస్విని నిర్మాణ బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు కూడా ఉన్నాయి. మరి తన కూతురికి బాలయ్య తన సినిమాతో ఎలాంటి సక్సెస్ అందిస్తారో తెలియాల్సి ఉంది.
Also Read: Express Hari: ఎక్స్ ప్రెస్ హరి నవ్వుల వెనుక కన్నీటి గాథ…ఇన్ని బాధలు పడ్డారా?