BigTV English

OTT Movie : గుండెను పిండేసే ముగ్గురు చిన్నారుల స్టోరీ… తండ్రి కోసం ఎవరూ చేయని సాహసం … ట్విస్టులతో మెంటలెక్కించే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : గుండెను పిండేసే ముగ్గురు చిన్నారుల స్టోరీ… తండ్రి కోసం ఎవరూ చేయని సాహసం … ట్విస్టులతో మెంటలెక్కించే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : మిస్సౌరీలోని ఓజార్క్స్‌లోని ఒక వింత గ్రామంలో , 17 ఏళ్ల రీ డాలీ తన తోడబుట్టిన వారిని, మానసిక స్థితి సరిగా లేని తల్లిని చూసుకుంటూ జీవిస్తోంది. ఆమె తండ్రి  జెస్సప్ డాలీ ఇంటిని తాకట్టు పెట్టి కనిపించకుండా పోతాడు. జెస్సప్‌ను వారం లోగా కోర్టుకు హాజరు చేయకపోతే, వారి ఇల్లు జప్తు అవుతుందని షెరీఫ్ రీ డాలీకి వార్నింగ్ ఇస్తాడు. రీ తన కుటుంబాన్ని రక్షించడానికి, జెస్సప్ కోసం వెతకడం ప్రారంభిస్తుంది. ఆమెకు గ్రామంలో అడుగడుగునా అడ్డంకులు వస్తాయి. ఇంతకీ జెస్సప్ ఎక్కడ ఉన్నాడు? అతను ఎందుకు అదృశ్యమయ్యాడు? ఈ గ్రామంలో ఉన్న సీక్రెట్స్ ఏమిటి? ఈ మూవీ పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్దాం పదండి.


స్టోరీలోకి వెళితే

ఈ స్టోరీ మిస్సౌరీలోని ఓజార్క్స్ పర్వత ప్రాంతంలో, మెథ్-రేవేజ్డ్ కమ్యూనిటీలో జరుగుతుంది. 17 ఏళ్ల రీ డాలీ తన 12 ఏళ్ల సోదరుడు సనీ, 6 ఏళ్ల సోదరి యాష్‌లీ, మానసిక స్థితి సరిగా లేని తల్లి ఏప్రిల్ని చూసుకుంటూ జీవిస్తోంది. ఈ కుటుంబం ఆర్టిక కష్టాలలో ఉంటుంది. రీ రోజువారీ జీవనానికి కష్టపడుతూ, పొరుగువారి సహాయంతో బతుకుతోంది. రీ తండ్రి అయిన జెస్సప్ డాలీ ఒక మెథాంఫెటమైన్ కుక్. ఇతను బెయిల్ కోసం ఇంటిని, భూమిని తాకట్టు పెట్టి కోర్టుకు హాజరు కాకుండా అదృశ్యమయ్యాడు. షెరీఫ్ బాస్కిన్, రీకి ఒక వారం గడువు ఇస్తాడు. ఇప్పుడు జెస్సప్‌ను కనిపెట్టి కోర్టుకు హాజరు చేయకపోతే, వారి ఇల్లు జప్తు అవుతుంది. రీ తన కుటుంబాన్ని రక్షించడానికి, జెస్సప్ కోసం వెతకడం ప్రారంభిస్తుంది. ఈ వెతుకులాటలో, గ్రామంలోని ఇతర వ్యక్తుల నుంచి రీకి సమస్యలు వస్తాయి. ఆమెను వెతకడం ఆపమని హెచ్చరిస్తారు. కానీ రీ పట్టువదలకుండా వెతుకుతూ ఉంటుంది.


రీకి అక్కడ ఏకైక సపోర్ట్ ఆమె స్నేహితురాలు గెయిల్ మాత్రమే, కానీ ఆమె కూడా పరిమిత సహాయం అందిస్తుంది. రీ వెతుకులాట ఆమెను గ్రామంలోని డార్క్ అండర్‌బెల్లీలోకి తీసుకెళ్తుంది. అక్కడ మెథ్ ల్యాబ్‌లు, గ్యాంగ్‌లు, హింసాత్మక సంస్కృతి ఆమె జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తాయి. ఈ క్రమంలో రీ జెస్సప్ గురించి ఒక భయంకరమైన నిజాన్ని తెలుసుకుంటుంది. ఆమె ఇంటిని రక్షించడానికి ఒక రిస్కీ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆమె గ్రామంలోని కోడ్ ఆఫ్ సైలెన్స్‌ను ఎదుర్కొంటుంది. తన కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుంటుంది. సినిమా ఒక బిట్టర్‌స్వీట్ నోట్‌తో నడుస్తుంది. చివరికి జెస్సప్ డాలీ ఎక్కడ ఉన్నాడు ? అతను ఎందుకు అదృశ్యమయ్యాడు? రీ జీవితం ప్రమాదంలో పడుతుందా? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : మనుషుల్ని మట్టున మాయం చేసే ఫ్యామిలీ… స్పైన్ చిల్లింగ్ హారర్ థ్రిల్లర్

ఏ ఓటీటీలో ఉందంటే 

ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘వింటర్స్ బోన్’  (Winters Bone). 2010 లో వచ్చిన ఈ సినిమాకి డెబ్రా గ్రానిక్ దర్శకత్వం వహించారు. జెన్నిఫర్ లారెన్స్ (రీ డాలీ),జాన్ హాక్స్ (టీర్‌డ్రాప్ డాలీ),గారెట్ డిల్లాహంట్ (షెరీఫ్ బాస్కిన్),డేల్ డిక్కీ (మెరాబ్), లారెన్ స్వీట్సర్ (గెయిల్), కెవిన్ బ్రీజ్‌నర్ (లిటిల్ ఆర్థర్), షెరీలీ లీ (ఏప్రిల్, రీ తల్లి) వంటి నటులు నటించారు. దీనికి IMDb లో 7.1/10 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), హులు (Hulu ) ఓటిటిలలో ఈ మూవీ అందుబాటులో ఉంది.

Related News

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

Big Stories

×