Express Hari: ఎక్స్ ప్రెస్ హరి(Express Hari) పరిచయం అవసరం లేని పేరు. కమెడియన్ గా ఎన్నో బుల్లితెర కార్యక్రమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేసిన హరి ప్రస్తుతం స్టార్ మా లో శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్న స్టార్ మా పరివార్ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో బిజీగా గడుపుతున్న హరి తాజాగా తేజస్వి మదివాడ(Tejaswi Madivada) యాంకర్ గా వ్యవహరిస్తున్న కాకమ్మ కథలు సీజన్2 (Kaakamma Kathalu Season 2)కార్యక్రమానికి హాజరయ్యారని తెలుస్తోంది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో వైరల్ అవుతుంది.
ప్రేమ వ్యవహారం…
ఇక ఈ కార్యక్రమానికి హరితోపాటు మరొక యాంకర్ అషు రెడ్డి(Ashu Reddy) హాజరయ్యారు. ఇకపోతే గతంలో వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని ఇద్దరు ప్రేమలో ఉన్నారు అంటూ అప్పట్లో వార్తలు పెద్ద ఎత్తున హల్చల్ చేశాయి. ఇక ఒకానొక సమయంలో అషు రెడ్డి హరి కోసం ఏకంగా బైక్ కొనుగోలు చేయడమే కాకుండా అప్పట్లో ఈయన కూడా తన చాతిపై అషు రెడ్డి ఫోటోని టాటూగా వేయించుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ పెద్దగా ఏ కార్యక్రమంలో కలిసి కనిపించలేదు చాలా రోజుల తర్వాత మరోసారి వీరిద్దరూ కాకమ్మ కథలు 2 కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆకలి బాధలు…
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎప్పటిలాగే వీరంతా కలిసి సందడి చేయడమే కాకుండా డబుల్ మీనింగ్ డైలాగులతో అందరిని నవ్వించారు.. ఇకపోతే ఈ కార్యక్రమంలో వీరు తమ జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. గత కొద్దిరోజుల క్రితం అషు రెడ్డి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయం గురించి మరోసారి తలుచుకొని ఈమె కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు హరి కూడా చిన్నప్పుడు తాను ఎదుర్కొన్న కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
Also Read: Pawan Kalyan -Vijay: పవన్ కళ్యాణ్ vs విజయ్ దేవరకొండ.. మాట తప్పుతున్న నాగ వంశీ?
చిన్నప్పటి నుంచి తాను ఎన్నో కష్టాలను అనుభవించానని తెలిపారు. స్కూల్లో దాదాపు 250 మంది వరకు ఉంటామని, సరిగ్గా స్నానాలు చేసే వసతి లేక ఎన్నో ఇబ్బందులు పడ్డామని, భోజనం చేస్తుంటే చేతుల వెంబడి రక్తాలు కారాయని హరి తెలిపారు. ఇక హాస్టల్లో మిగిలిపోయిన ఇడ్లీల కోసం పరుగులు పెడుతూ కిందపడి లేచి వెళ్లే వాళ్ళమని, మోకాలు పగిలి కాళ్ల వెంబడి రక్తాలు వచ్చేవని లైన్ లో ముందు నిలబడితే ఆ మిగిలిపోయిన ఇడ్లీ దొరుకుతుందని ఆశ అంటూ హరి అప్పటి ఆకలి బాధలను గుర్తు చేసుకున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో కూడా అంతే అందరూ క్యాంటీన్ కెళ్ళి వాళ్లకు నచ్చింది తింటే మేము మాత్రం ఎవరైనా ఒక పది రూపాయలు ఇస్తే బాగుండు ఒక చపాతి అయిన కొనుక్కుందామని ఆశగా ఎదురుచూసే వాడిని అంటూ తన కన్నీటి కష్టాలను ఆకలి బాధలను బయట పెట్టడంతో తేజస్వి కూడా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో వైరల్ అవుతుంది. ఇంకా వీరిద్దరూ వారి కెరియర్ గురించి ఎలాంటి విశేషాలను పంచుకున్నారనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాలి.