BigTV English
Advertisement

NBK 109 : బాలయ్య 109 రికార్డ్‌ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే..

NBK 109 : బాలయ్య 109 రికార్డ్‌ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే..

NBK 109 : నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. భగవంత్ కేసరి సినిమాతో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత NBK 109 సినిమాతో సంక్రాంతికి రాబోతున్నాడు. ఇక ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. మరో వైపు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ ప్రారంభం అయింది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ..NBK109 సినిమా అన్ని ఏరియాల్లో కలిపి రూ.90 కోట్లకు అమ్ముడు పోయినట్లు సమాచారం. ఇక ఆంధ్రాలో రికార్డ్ బ్రేక్ చేసే బిజినెస్ ను చేసిందని తెలుస్తుంది. మరి ఏ ఏరియాల్లో ఎంత బిజినెస్ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..


బాలయ్య, డైరెక్టర్ బాబీ కాంబోలో రాబోతున్న సినిమా NBK 109.. ఈ సినిమా పై బాలయ్య ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీలో బాలయ్య మాస్ లుక్ కనిపిస్తున్నాడు. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ టైటిల్ ను ఇంకా రివిల్ చెయ్యకపోవడం కొంత నిరాశ కలిగించిన్నా సినిమాపై హైప్ క్రియేట్ అవుతున్నందుకు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.. ఇక ఈ సినిమాను మొదటగా దసరా కానుకగా రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాలవల్ల ఈ సినిమాను సంక్రాంతికి పోస్ట్ పోన్ చేశారు. ఈ సినిమా బిజినెస్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే ఒక్కో ఏరియాలో మామూలుగా లేదు. దాదాపు 100 కోట్ల వరకు రాబట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి..

ఇకపోతే రూ.90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే సినిమా కి రూ.100 కోట్ల షేర్‌ కలెక్షన్స్ రావాల్సి ఉంటుంది. అంటే దాదాపుగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్స్‌ నమోదు అవ్వాల్సి ఉంటుంది. గతంలో భారీ విజయాన్ని అందుకున్న అఖండను మించి కలెక్ట్ చెయ్యాల్సి ఉంది. ఇక బాలయ్య సినిమాకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రాలో రూ. 40 కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తుంది. అలాగే తెలంగాణలో కూడా మంచి బిజినెస్ జరిగిందని టాక్.. ఇక సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12 నా గేమ్ చేంజర్ కు పోటీగా రాబోతుంది. ఏ సినిమా ఎంత కలెక్షన్స్ వసూల్ చేస్తుందో అనేది ఆసక్తిగా మారింది. ఈ సినిమాకు థమన్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సినిమాకు సంబంధించిన టైటిల్‌ రివీల్‌ చేసిన తర్వాత అంచనాలు మరింతగా పెరగడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.. ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్స్ సినిమాపై అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య అఖండ టు సినిమా చేయబోతున్నారు ఆ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగిన సంగతి తెలిసిందే..


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×