BigTV English
Advertisement

Balayya : రూ. 7.75 లక్షలతో ఫ్యాన్సీ నెంబర్.. బాలయ్య అంటే తగ్గేదేలే…

Balayya : రూ. 7.75 లక్షలతో ఫ్యాన్సీ నెంబర్.. బాలయ్య అంటే తగ్గేదేలే…

Balayya : నందమూరి నటసింహం బాలయ్య పేరు వింటే ఫ్యాన్స్ కు పూనకాలు వస్తాయి. ఇక ఆయన సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించడం కష్టం. ఇటీవల డాకు మహారాజు సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. అ మూవీ యావరేజ్ టాక్అందుకున్న కూడా కలెక్షన్స్ పరంగా దుమ్ము దులిపేసింది.. సినిమాల పరంగా దులిపేస్తున్న బాలయ్య ఎందులోనూ తగ్గేదేలే అంటున్నాడు. అవును మీరు విన్నది నిజమే.. తాజాగా బాలయ్య గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటో ఒకసారి తెలుసుకుందాం..


ఫ్యాన్సీ నెంబర్ కోసం లక్షల ఖర్చు.. 

తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఫ్యాన్సీ ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఖరీదైన కార్లు, బైకులకు ప్రత్యేక నంబర్ల కోసం వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు కూడా లక్షల్లో డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు. గట్టి పోటీతో పాటుగా లక్షలు ఖర్చు చేసి మరి కొనుకున్నారు. భారీగా ఆదాయం చేకూరింది. ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయానికి శనివారం ఒక్క రోజే రూ.3.71 కోట్ల ఆదాయం వచ్చింది. టీజీ09 ఎఫ్‌ 0001 నంబర్‌ను రూ.7.75 లక్షలకు సినీనటుడు, ఎమ్మెల్యే బాలయ్య దక్కించుకున్నారు.. ఒక్క నెంబర్ కోసం ఇంత పెట్టారు అంటే మాములు విషయం కాదు.. ఈ విషయం బాలయ్య ఫ్యాన్స్ చెవిన పడింది. దాంతో బాలయ్య ఎక్కడా తగ్గేదేలే అని సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతుంది..


ఫ్యాన్సీ నెంబర్స్ ను ఎలా పొందాలి..?

ఇటీవల కాలంలో ఫ్యాన్సీ నెంబర్స్ కు డిమాండ్ ఎక్కువగా ఉంది. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటుగా సామాన్యులు సైతం భారీగా ధరను పెట్టి కొనుగోలు చేస్తున్నారు. అయితే ఫ్యాన్సీ నెంబర్ ను ఎలా పొండాలి అనే సందేహం ఉంది. కదూ.. ఎలానో చూద్దాం.. ఫ్యాన్సీ నంబర్లను పొందేందుకు ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపై వేలం ప్రక్రియలో పాల్గొనవచ్చు. ఇది పూర్తిగా పారదర్శకంగా నిర్వహించబడుతుంది. రవాణాశాఖ ఆధికారుల ప్రకారం, ప్రజల నుంచి స్పందన అనూహ్యంగా ఉందని వారు తెలిపారు. అత్యధిక ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ రవాణాశాఖ భవిష్యత్తులో మరిన్ని ప్రత్యేక నంబర్లను విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది. ఇకపోతే త్వరలోనే గోల్డెన్ సిరీస్ నంబర్స్ ను కూడా అందించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

Also Read : ప్రభాస్‌పై మోజు పడ్డ పాకిస్తానీ హీరోయిన్… పాక్ మీడియా స్టూడియోలోనే అలా అనేసింది..

బాలయ్య సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది సంక్రాంతి కి డాకు మహారాజ్ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. థియేటర్లలో యావరేజ్ టాక్ ను అందుకున్నా కూడా కలెక్షన్స్ భారీగానే రాబట్టింది. ఇక ప్రస్తుతం బోయపాటి శీను కాంబోలో అఖండ 2 చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని టాక్..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×