OTT Movie : ఇప్పుడు కొరియన్ సినిమాలను చూడటానికి మన వాళ్ళు ఎక్కువగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈమధ్య కొరియన్ వెబ్ సిరీస్ లను కూడా వదిలి పెట్టకుండా చూస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోపోయే మూవీ ఒక డిఫరెంట్ స్టోరీ తో వచ్చింది. పెరాలసిస్ వచ్చిన ఒక అమ్మాయి మంచం మీద కదలలేని స్థితిలో ఉంటుంది. ఆమెతో చాలామంది అసభ్యంగా ప్రవర్తిస్తూ, పైశాచిక ఆనందం పొందుతుంటారు. ఈ మూవీలో అనుకోని ట్విస్ట్ లు కూడా ఎదురవుతాయి. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
బింగేడ్ (Binged) లో
ఈ కొరియన్ మూవీ పేరు ‘ది అంకుల్’ (The Uncle). 2017 లో విడుదలైన ఈ మూవీకి కిమ్ హ్యుంగ్-జిన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఇప్-సే అనే 19 ఏళ్ల అమ్మాయిచుట్టూ తిరుగుతుంది. బింగేడ్ (Binged) ఓటీటీ లో ఈ కొరియన్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఇప్-సే పెరాలసిస్ కారణంగా ఎటూ కదలలేని స్తితిలో ఉంటుంది. తల్లిదండ్రులు కూడా ఒక ప్రమాదంలో చనిపోవడంతో, ఆమె తీవ్రమైన మానసిక వేదనతో బాధపడుతూ ఉంటుంది. ఆమె జీవితం ఒక మొక్కలాగా కదలకుండా ఉంటుంది. తన కుటుంబం ఎలా చనిపోయారో కూడా ఆమెకు తెలీకుండా ఉంటుంది. ఆమె పూర్తిగా తన పొరుగువారిపై ఆధారపడుతుంది. అయితే అక్కడ ఉండే కురాళ్ళు ఆమెను అసభ్యంగా తాకుతూ, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. ఆమె ఎవరికీ చెప్పుకోలేక తనలోనే బాధపడుతూ ఉంటుంది. ఇది తెలిసి జా-యోంగ్ అనే సామాజిక కార్యకర్త ఆమెను చూసుకోవడానికి ఇద్దరు మనుషుల్ని పెడతాడు. అయితే ఇద్దరిలో ఒక మగ వ్యక్తి కూడా ఉంటాడు. వాడుకూడా ఇప్-సే ని తప్పుడు దృష్టి తో చూస్తుంటాడు. సమయం దొరికినప్పుడల్లా ఆమెను తాకుతూ పైశాచిక ఆనందం పొందుతుంటాడు. మరో అమ్మాయి తనని బాగా వేధిస్తూ ఉంటుంది.
ఈ క్రమంలో ఒక రోజు గ్యాంగ్-సిక్ అనే వ్యక్తి , ఆమె మామ అని చెప్పుకుంటూ ఆమె ఇంటికి వస్తాడు. రే*ప్, హత్యకేసులో నిందితుడిగా ఉంటాడు గ్యాంగ్-సిక్. నిజానికి ఇప్-సే తల్లిని అలా చేసింది గ్యాంగ్-సిక్. ఈ విషయం దాచిపెట్టి ఆమెకు తోడుగా ఉంటాడు. అంత క్రూరమైన వ్యక్తి ఈ అమ్మాయి విషయంలో మంచిగానే ఉంటాడు. అయితే ఇప్-సే ని అనుభవించడానికి అక్కడ ఉన్న వాళ్ళంతా ఎదురుచూస్తుంటారు. ఇంతలో ఒక పోలీస్ వచ్చి గ్యాంగ్-సిక్ ను హెచ్చరిస్తాడు. ఇక అక్కడి నుంచి అతను వెళ్లిపోయే సమయం వస్తుంది. చివరికి గ్యాంగ్-సిక్, ఇప్-సే మధ్య సంబంధం దేనికి దారి తీస్తుంది ? గ్యాంగ్-సిక్ వెళ్లిపోతే ఆమె పరిస్తితి ఏమౌతుంది ? తన తల్లిని చంపింది గ్యాంగ్-సిక్ అని ఆమెకు తెలుస్తుందా ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ కొరియన్ మూవీని మిస్ కాకుండా చూడండి. ఈ సినిమాను అడల్ట్ కంటెంట్ కారణంగా, ఒంటరిగా చూడటమే మంచిది.
Read Also : కోరిన వరాలు ఇచ్చే గది … కొడుకు కాని కొడుకుతో ప్రెగ్నెంట్ అయ్యే తల్లి … సస్పెన్స్ తో పిచ్చెక్కించే స్టోరీ