BigTV English

Balayya’s political film :బాలయ్య పొలిటికల్ సినిమా… ఏపీ ఎలక్షన్సే టార్గెట్

Balayya’s political film :బాలయ్య పొలిటికల్ సినిమా… ఏపీ ఎలక్షన్సే టార్గెట్


Balayya’s political film : ఎన్నికల సమయంలో సినిమా కూడా ఓ ఆయుధమే. గత ఎన్నికలప్పుడు టీడీపీ, వైసీపీ మధ్య సినీ వార్ నడిచింది. ఎన్టీఆర్ జీవిత చరిత్రపై రెండు పార్ట్స్‌గా సినిమాలు తీస్తే.. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఒకటి, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అంటూ మరో సినిమా తీశారు. ఈ సినిమాలతోనే పోటాపోటీగా తిట్టుకున్నారు. ఇప్పుడు ఏపీలో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. వచ్చే ఏడాది ఈ సమయం కల్లా పోలింగ్ కూడా జరిగిపోవచ్చు. సో, రెండు పార్టీలు మళ్లీ తొందపడుతున్నాయి. జగన్ సక్సెస్ స్టోరీపై సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు. యాత్ర సినిమాకు సీక్వెల్‌గా యాత్ర-2 తీసుకొస్తున్నారు. ఇందులో తమిళ హీరో జీవా.. వైఎస్ జగన్‌గా కనిపించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇటు నందమూరి బాలకృష్ణ ఈసారి కూడా పక్కా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ సినిమాతో రావాలనుకుంటున్నారు.

బాలయ్య-బోయపాటి కాంబో గురించి చెప్పక్కర్లేదు. అన్నీ సూపర్ హిట్సే. అఖండ సినిమా ఘన విజయం సాధించడంతో అఖండ సీక్వెల్ ఉంటుందని అప్పుడే అనౌన్స్ చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. జూన్ 10న బాలకృష్ణ పుట్టిన రోజు కావడంతో ఆ రోజే బాలయ్య-బోయపాటి సినిమా అనౌన్స్‌మెంట్ ఉంటుందంటున్నారు. అయితే, ఆ సినిమా అఖండకు సీక్వెల్ మాత్రం కాదని తెలుస్తోంది. ఎన్నికలు వస్తున్నందున పక్కా పొలిటికల్ ఫ్లేవర్‌తో సినిమా తీయాలనుకుంటున్నారట. సింహా, లెజెండ్ సినిమాల్లో ఇప్పటికే పొలిటికల్ టచ్ ఇచ్చి వదిలేశారు. ఈసారి మాత్రం పక్కా పొలిటికల్ ట్రీట్ ఉంటుందని, వచ్చే ఏపీ ఎలక్షన్స్ నాటికి ఈ సినిమాను రిలీజ్ చేయొచ్చని చెబుతున్నారు.


ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడి డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు. ఇందులో బాలయ్య సరికొత్తగా కనిపించబోతున్నారని టాక్. శ్రీలీల హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్‌గా జరుగుతోంది. మరోవైపు బోయపాటి కూడా బిజీగా ఉన్నాడు. రామ్ పోతినేని హీరోగా పవర్ సబ్జెక్టుతో సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలనేది ప్లాన్. ఈ సినిమా షూటింగ్ ఆల్‌మోస్ట్ అయిపోయిందని కూడా చెబుతున్నారు. సో, వచ్చే రెండు మూడు నెలల్లో ఈ ఇద్దరూ ఫ్రీ అయిపోతారని, ఆ తరువాత షూటింగ్ మొదలవుతుందని చెబుతున్నారు. ఈ లోపు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సినిమాను లాంఛనంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×