ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh)పేరు ఎత్తగానే ముందుగా వినిపించే పేరు పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానిని అంటూ చెప్పుకునే బండ్ల గణేష్ ఈమధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియాలో తనకు నచ్చిన విషయాన్ని తెలియజేసే బండ్ల గణేష్ తనను పవన్ కళ్యాణ్ నుంచి త్రివిక్రమ్(Trivikram)దూరం చేశాడు అంటూ పరోక్షంగా కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఏ రకంగా త్రివిక్రమ్ కారణం అనే విషయాన్ని మాత్రం నేరుగా వెల్లడించలేదు.. ముఖ్యంగా తన దేవుడి నుంచి తనను కొన్ని శక్తులు దూరం చేస్తున్నాయి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాను చేసిన తప్పు అదే అంటూ మరొకసారి ట్విట్టర్ ద్వారా పోస్ట్ పెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు.
గుడ్డిగా నమ్మడమే నేను చేసిన తప్పు..
ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బండ్ల గణేష్ తాజాగా ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశారు. ఇక అందులో ఏముందనే విషయానికొస్తే.. “నా సమస్య ఏమిటంటే.. ఎదుటి వారి గురించి ఎక్కువగా ఆలోచించడం, ఎదుటి వారిపై ఎక్కువ ప్రేమ చూపించడం, ఎక్కువ కేర్ తీసుకోవడం, ఎదుటివారిని గుడ్డిగా నమ్మడం అలాగే ఎదుటివారి నుంచి అంతే ప్రేమ ఆశించడం.. చివరికి నాకు మిగిలేది నిరాశ, బాధ తప్పా ఇంకేమీ లేదు” . అందుకే ఇతరులను నేను గుడ్డిగా నమ్మడమే నేను చేస్తున్న అతిపెద్ద తప్పు అదే నా సమస్య అంటూ చెప్పుకొచ్చారు బండ్ల గణేష్. మరి బండ్ల గణేష్ ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి చేశారు అనే విషయం మాత్రం అర్థం కావడం లేదు. ఏదేమైనా బండ్ల గణేష్ చేసిన ఈ పోస్ట్ మాత్రం బాగా వైరల్ గా మారుతోంది.ఇది చూసిన అభిమానులు, నెటిజనులు బండ్లన్న ఎవరిని గుడ్డిగా నమ్మాడు? ఎవరు ఆయనను మోసం చేశారు? అంటూ ఆరాతీస్తున్నారు.
బండ్ల గణేష్ కెరియర్..
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన బండ్ల గణేష్ సినీ నిర్మాతగా, నటుడిగా, కమెడియన్ గా ఇటీవల హీరోగా కూడా మారి మంచి పేరు దక్కించుకున్నారు. సుస్వాగతం, సూర్యవంశం, నువ్వు నాకు నచ్చావ్, సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలలో కామెడీ పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించిన ఈయన, నిర్మాతగా మారి ఆంజనేయులు, తీన్మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరు అమ్మాయిలతో వంటి చిత్రాలను నిర్మించాడు. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈయనకు టికెట్టు దక్కలేదు. ఆ తర్వాత 2019 ఏప్రిల్ 5న రాజకీయాల నుండి తప్పుకున్నట్లు తెలిపాడు.బండ్ల గణేష్ హీరోగా కూడా ఒక సినిమా చేసిన విషయం తెలిసిందే. ‘డేగల బాబ్జి’ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా పెద్దగా మెప్పించలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు అంశాలపై స్పందిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు బండ్ల గణేష్.