Brahmamudi serial today Episode: డైనింగ్ టేబుల్ దగ్గర జరిగిన గొడవను తీసుకెళ్లి ప్రకాష్‌తో చెప్తుంది ధాన్యలక్ష్మీ. కోట్ల ఆస్థి పెట్టుకుని ఇలా చిల్లరగా చేయడం కరెక్టేనా…? అని అడుగుతుంది. దీంతో ఏం చేసిందని ప్రకాష్ అడుగుతాడు. ఇడ్లీ చేసిందని ధాన్యలక్ష్మీ చెప్పగానే అవును నేను కూడా తిన్నాను బాగానే ఉంది కదా అంటాడు. నువ్వు కూడా చిల్లరగా బిహేవ్ చేయకుండా కామ్‌గా ఉండు అని చెప్పి వెళ్లిపోతాడు ప్రకాష్.
గార్డెన్ లో ఆలోచికస్తూ కూర్చున్న అపర్ణ దగ్గరకు కావ్య వెళ్లి అత్తయ్యా నా విషయంలో మీకు కోపంగా ఉందా? అని అడుగుతుంది. నువ్వేం చేసినా అందులో ఏదో అర్థం ఉంటుంది కావ్య.. మనిషిని అర్థం చేసుకోకపోతే ఎలా కానీ ఈ ఇంట్లో చాలా మంది అలా అర్థ చేసుకోవడం లేదు. అని అపర్ణ చెప్పగానే థాంక్యూ మీరైనా నన్ను అర్థం చేసుకున్నారు. కానీ ఒక్క విషయం నాకు అర్థం కావడం లేదు ఆకలి అంటే అన్నం పెట్టే నువ్వు నీ సొంత ఇంట్లోనే ఇలా చేస్తున్నావు అంటే దానికి బలమైన కారణం ఉండొచ్చు అని నమ్ముతున్నాను.
కుబుంట గౌరవాన్ని కాపాడటం అంటే లక్షలు ఖర్చు పెట్టి లక్సరీ కార్లలో తిరగడం కాదు అది నీకు పుష్కలంగా ఉంది. నీకు నచ్చినట్టు చేయ్. నువ్వు ఇంటి విషయంలో ఇంత కఠినంగా ఉన్నావంటే ఏదో బలమైన కారణం ఉంటుందని నమ్ముతున్నాను అంటుంది అపర్ణ. అవును అత్తయ్య బలమైన కారణమే ఉంది. కానీ మీకు టైం వచ్చినప్పుడు చెప్తాను అని వెళ్లిపోతుంది.
రుద్రాణి, ధాన్యలక్ష్మీ బయటి నుంచి టిఫిన్స్ ఫార్సిల్ తెప్పించుకుని తింటారు. కావ్యను చూసి కావాలని టిఫిన్స్ పేర్లతో సహా చెప్పుకుంటూ తింటుంటారు. కావ్య మాట్లాడకుండా వచ్చి తను టిఫిన్ చేస్తుంది. రుద్రాణి, ధాన్యలక్ష్మీ స్పీడుగా టిఫిన్ చేస్తుంటే.. స్వప్న నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావు అని రుద్రాణి అడుగుతుంది. మీరు ఆకలితో తిన్నట్టు లేదు. మా కావ్య మీద కోపంతో తింటున్నట్టు ఉంది అని చెప్తుంది స్వప్న. నువ్వు తిను రాహుల్.. నెల రోజుల నుంచి తిండి తిననట్టు తింటున్నావు కదా ఇంకా స్పీడుగా తిను అంటుంది. నీకు కూడా ఇడ్లీ తినకపోతే మా టిఫిన్స్ తినొచ్చు.. అని ధాన్యలక్ష్మీ, స్వప్నకు చెప్తుంది. వద్దు అంటీ కడుపుతో ఉన్నాను కదా..? అడ్డమైన గడ్డి తినొద్దని డాక్టర్ చెప్పారు.అంటుంది స్వప్న.
హాస్పిటల్ లో సీతారామయ్య పక్కన కూర్చున్న ఇందిరాదేవి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో రాజ్, కావ్య వస్తారు. ఏంటిది అమ్మమ్మ మీరు ఇక్కడ ఉంటే ఇంకా భయపడతారని, బాధపడతారనే కదా.? మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లింది అని కావ్య చెప్తుంది. అన్ని బాగున్నప్పుడు ఈయనతో కలిసి ఉండి ఈ పరిస్థితుల్లో నేను ఇంటి దగ్గర ఎలా ఉండగలను అమ్మా అంటుంది ఇందిరాదేవి. ఇంతలో కళ్యాణ్ రావడంతో హాస్పిటల్ బిల్లు 5లక్షలు కట్టు అని చెక్ ఇస్తాడు రాజ్.
ఇంట్లో లంచ్‌కు ఏం చేశావని శాంతను అడుగుతారు రుద్రాణి, ధాన్యలక్ష్మీ. పప్పు , అన్నం చేశానని చెప్తుంది శాంత. గేదేలు, గొర్రెలు తినేది కాకుండా మనుషులు తినేది ఏమైనా ఉంటే చెప్పు అని ధాన్యలక్ష్మీ అడుగుతుంది. అంటే నాకు అర్థం కాలేదు అంటుంది శాంత. చికెన్, మటన్, ఫ్రాన్స్, ఫిష్ లాంటివి ఏమీ లేవా అంటుంది రుద్రాణి. అవేమీ లేదని శాంత చెప్తుంది. దీంతో రుద్రాణి, ధాన్యలక్ష్మీ ఇద్దరు కలిసి ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టాలనుకుంటారు. క్రెడిట్ కార్డ్స్ పనిచేయవు దీంతో ఇద్దరూ షాక్ అవుతారు. ఇద్దరు కలిసి కావ్యను తిడతారు. బయటకు వెళ్లి సుభాష్‌తో కావ్య గురించి చెప్తారు. నీ కోడలు ఆస్థి చేతికి వచ్చాక అధికారం చేతిలో ఉంది కదా.? మమ్మల్ని టార్చర్ చేస్తుంది అని చెప్తారు. తమ కార్డ్స్ బ్లాక్ చేశారని చెప్తారు. దీంతో కావ్య ఏదైనా చేసింది అంటే దానికి ఏదైనా బలమైన కారణం ఉంటుంది అంటూ కావ్యను సపోర్టుగా మాట్లాడతాడు సుభాష్.
ఆఫీసు అకౌంట్‌లో జీరో బ్యాలెన్స్ ఉందని రాజ్, కావ్య కంగారు పడుతుంటారు. కంపెనీకి ఫోన్ చేసి అకౌంట్ నుంచి ఎంత డ్రా చేశారు. అని అడుగుతాడు రాజ్. మీరు 20 లక్షలు తీసుకోమన్నారు కానీ అకౌంట్ లో 15 లక్షలే ఉన్నాయి వాటినే వాడుకున్నాం సార్ అని మేనేజర్ చెప్తాడు. దీంతో ఇద్దరూ కంగారు పడుతుంటారు. వచ్చేటప్పుడు మా అక్కకు ఎంటీ చెక్ ఇచ్చాను కదా..? అద ఏమైనా వాడుకుందేమో తెలుసుకుంటాను అని స్వప్నకు ఫోన్ చేస్తుంది కావ్య. స్వప్న ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?