Mirai: ప్రముఖ టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) తొలి పరిచయంలో దర్శకుడుగా చేసిన చిత్రం ‘మిరాయ్’. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) హీరోగా నటించగా .. ప్రముఖ బ్యూటీ రితిక నాయక్ (Ritika Nayak) హీరోయిన్ గా నటించింది. ప్రముఖ సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్ (Sriya Saran) తో పాటు ప్రముఖ హీరో కం విలన్ జగపతిబాబు (Jagapathi Babu) కీలక పాత్రలు పోషించారు. ఇందులో విలన్ గా మంచు మనోజ్ (Manchu Manoj), మెయిన్ విలన్ గా రానా దగ్గుబాటి(Rana Daggubati) కీలకపాత్రలు పోషించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మొదటి రోజే రూ.27 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సరికొత్త విజయం అందుకుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే ప్రభాస్ రెమ్యూనరేషన్. నిజానికి ఇందులో ప్రభాస్ నటించలేదు. కానీ ఆయన ఫేస్ తో పాటు వాయిస్ ని ఏఐ ద్వారా జెనరేట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అసలు ప్రభాస్ నటించనేలేదు.. అలాంటప్పుడు రెమ్యూనరేషన్ తీసుకోవడం ఏంటి? అంటూ కొంతమంది కామెంట్లు చేశారు. మరికొంతమంది భద్రతా కారణాలవల్ల నిజానికి తమ ఫోటో వాడుకున్నా సరే సెలబ్రిటీలకు డబ్బులు ఇవ్వాల్సిందే అని ఇంకొంతమంది అసలు విషయాన్ని చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించారు. దీనికి తోడు సినిమా స్టార్టింగ్ ఆయన వాయిస్ ఓవర్ తోనే ప్రారంభం అవుతుంది. దీంతో ఆయన ఈ సినిమాలో నటించారు.. వాయిస్ ఓవర్ ఇచ్చారు అంటూ వార్తలు రాగా.. అది నిజం కాదు. ఈ రెండింటి కోసం ఏఐ టెక్నాలజీని ఉపయోగించారు.
ALSO READ:Manchu Lakshmi: ఇన్నాళ్లకు ఈడీ విచారణపై స్పందించిన మంచు లక్ష్మీ.. 100మందిలో ఒకరు?
మిరాయ్ కోసం ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతంటే?
మరి ఏఐ ఉపయోగించి ప్రభాస్ ఫోటోతో పాటు వాయిస్ ని ఉపయోగించినందుకుగాను ప్రభాస్ కి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చింది అనే విషయం వైరల్ గా మారింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ తో ప్రభాస్ కి ఉన్న సాన్నిహితం కారణంగా ఆయన ఒక రూపాయి కూడా తీసుకోలేదని సమాచారం. దీనికి తోడు ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ది రాజా సాబ్ సినిమా చేస్తున్నారు. దీని వల్లే ఆయన డబ్బులు తీసుకోలేదని సమాచారం. ఏది ఏమైనా ప్రభాస్ సాన్నిహిత్యం కారణంగా కూడా రెమ్యూనరేషన్ వదులుకోవడంతో అభిమానులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ప్రభాస్ సినిమాలు..
ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మారుతీ(Maruti ) దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్లో సినిమా విడుదల కావాల్సి ఉండగా వచ్చే ఏడాది జనవరికి సినిమాను వాయిదా వేశారు. ఈ సినిమా తర్వాత హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో వస్తున్న ‘ఫౌజీ’ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ ఏడాది డిసెంబర్లో సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. అలాగే సలార్ సీక్వెల్ తో పాటు కల్కి సీక్వెల్లో కూడా ప్రభాస్ నటించబోతున్నారు.