సాధారణంగా ఎముక విరిగితే మళ్లీ కట్టుకోవడానికి వారాల నుంచి నెలల సమయం పడుతుంది. గాయం తీవ్రతను బట్టి మానే విధానం ఉంటుంది. అయితే, ఇప్పుడు చైనీస్ పరిశోధకులు బోన్ గ్లూను కనిపెట్టారు. దీని ద్వారా విరిగిన ఎముకలను అతికించే అవకాశం ఉంటుందని వెల్లడించారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ గ్లూతో విరిగిన ఎముకలను కేవలం 3 నిమిషాల్లోనే సరిచేయవచ్చు. చైనీస్ శాస్త్రవేత్తలు నిమిషాల్లో విరిగిన ఎముకలను అతికించే కొత్త విధానాన్ని కనిపెట్టారు. ఎముక పగుళ్లలో ఈ జిగురు అంటించి మళ్లీ యథావిధిగా మార్చే అవకాశం ఉందన్నారు.
తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ లోని ఒక పరిశోధనా బృందం తాజాగా బోన్-02 బోన్ జిగురు కీలక ప్రకటన చేసినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. సర్ రన్ షా హాస్పిటల్ చీఫ్, అసోసియేట్ చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ లిన్ జియాన్ ఫెంగ్, నత్త గుల్లలు నీటి అడుగున వంతెనకు అతుక్కుపోయి ఉండటం చూసినప్పుడు ఎముక జిగురును సృష్టించడానికి ప్రేరణ పొందినట్లు వెల్లడించారు. రక్తం అధికంగా ఉండే వాతావరణంలో కూడా జిగురు కేవలం రెండు నుండి మూడు నిమిషాల్లో కచ్చితంగా అతుక్కుంటుందని లిన్ వెల్లడించారు. ఎముక నయం అవుతున్నప్పుడు, శరీరం సహజంగా అంటుకునేలా చేస్తుందన్నారు. ఇంప్లాంట్లను తొలగించడానికి అదనపు ఆపరేషన్అవసరాన్ని తొలగిస్తుందని కూడా ఆయన వివరించారు.
Read Also: చీర కొంగుతో నక్కను చంపేసిన మహిళ.. అరగంట పోరాడి..
బోన్-02 సేఫ్టీ, ఎఫిషియన్సీ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని ల్యాబోరేటరీ పరీక్షలు కన్ఫార్మ్ చేశాయి. సాంప్రదాయ చికిత్సలకు సర్జన్లు స్టీల్ ప్లేట్లు, స్క్రూలను చొప్పించడానికి ఒక పెద్ద కటింట్ పెట్టాల్సి ఉంటుంది. కానీ, ఒక ట్రయల్ ప్రకారం వైద్యులు బోన్ గ్లూ ప్రక్రియను 180 సెకన్ల కంటే తక్కువ సమయంలో లేదంటే మూడు నిమిషాలలో పూర్తి చేయగలరని తేలింది. పరిశోధకులు 150 మందికి పైగా వ్యక్తులపై ఈ గ్లూను విజయవంతంగా పరీక్షించారు. ఎముకను అతికించిన తర్వాత గరిష్టంగా 400 పౌండ్లకు పైగా బరువును ఉంచారు. కానీ, ఎలాంటి ఇబ్బంది కలగలేదని పరిశోధకులు వెల్లడించారు. ఈ గ్లూ సాంప్రదాయ మెటల్ ఇంప్లాంట్లను భర్తీ చేయగలదని పరిశోధకులు నిర్ధారించారు. ఇది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని, ప్రతికూల ప్రతిచర్యలను తగ్గించవచ్చని వెల్లడించారు. ప్రస్తుతం ఎముక పగులు చికిత్స కోసం సిమెంట్ కట్లు వేస్తున్నారు. కానీ, ఈ పద్దతిలో ఎముక అంత త్వరగా కట్టుకోదు. కాస్త సమయం తీసుకుంటుంది. శాస్త్రవేత్తలు మొదట 1940లలో అక్రిలేట్లు, ఎపాక్సీ రెసిన్లు, జెలటిన్లను ఉపయోగించి ఎముకను కట్టుకునేలా చేసేవాళ్లు. అయితే, అవి బయో కాంపాబిలిటీ సమస్యలను కలిగిస్తాయి. ఆ తర్వాత వాటిని ఆధునిక వైద్యులు తిరస్కరించారు. ఇక తాజాగా చైనా పరిశోధకులు తీసుకొచ్చిన ఈ బోన్-02 గ్లూ ఎముకను అతికించే చికిత్సలో ఓ సంచలనం కాబోతోంది.
Read Also: బొమ్మల షాపులో దొంగ మకాం.. ఆరు నెలలు అక్కడే తిష్ట వేసినా కనిపెట్టలేకపోయిన సిబ్బంది!