E-Paper
Advertisement

Beard Stars : ట్రెండ్ సెట్ చేసిన బియర్డ్ స్టార్స్.. అది లేకపోతే లుక్కే లేదు మరి..

Beard Stars : ట్రెండ్ సెట్ చేసిన బియర్డ్ స్టార్స్.. అది లేకపోతే లుక్కే లేదు మరి..
Advertisement
Bearded stars set the trend.

Beard Stars : ఒకప్పుడు సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే వారు మాత్రమే భయంకరంగా కనిపించాలని గెడ్డాలు పెంచేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. గెడ్డం పెంచడంలో మేమేం తక్కువ కాదంటున్నారు స్టార్ హీరోలు. గుబురు గెడ్డంతో, అదిరిపోయే లుక్‌తో ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నారు. మరి గెడ్డం ట్రెండ్ సెట్ చేసిన హీరోలెవరో ఓ లుక్కేద్దామా!

గడ్డం విషయంలో తగ్గేదే లే..
సుకుమార్ దర్శకత్వంలో రూపొందించిన ‘పుష్ప’ సినిమాతో టాలీవుడ్‌లో గెడ్డం ట్రెండ్ బాగా పాపులర్ అయింది. ఈ సినిమాలో గుబురుగా పెంచిన గెడ్డంతో అల్లు అర్జున్ చెప్పే ‘తగ్గేదె లే’ డైలాగ్.. యూత్‌కు ఊత పదంగా మారిపోయింది.

Advertisement

అమాంతం పెరిగిన రాఖీ భాయ్ క్రేజ్..
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో, యష్ నటించిన కేజీఎఫ్-1,2ల్లో నటించిన ప్రధాన పాత్రలు అన్నింటికీ గెడ్డం ఉంటుంది. ఈ సినిమాకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్, కథ, విజువల్స్ ఎంత క్రేజ్ తీసుకొచ్చాయో.. యష్ గెడ్డం కూడా సినిమాకు అంతే క్రేజ్‌సృష్టించింది.

రోలెక్స్ సార్..
లోకేశ్‌ కనగరాజ్‌దర్శకత్వంలో.. కమలహాసన్ హీరోగా నటించిన ‘విక్రమ్’ సినిమా క్లైమాక్స్‌లో సూర్య పోషించిన రోలెక్స్‌ రోల్ ఆడియన్స్‌లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. కేవలం కొన్ని క్షణాలు మాత్రమే ఉండే సూర్య గెడ్డం లుక్, హావభావాలు ఫ్యాన్స్‌ను కట్టిపడేశాయి.

Advertisement

అమీర్ ఖాన్ లుక్‌లోనే కిక్కూ..బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ యాక్టింగ్, స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడూ క్లీన్ షేవ్‌తో కనిపించే అమీర్ ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’, ‘దంగల్’ వంటి సినిమాల్లో వివిధ రకాల బియర్డ్స్‌తో కనిపించి బాలీవుడ్‌లో గెడ్డం ట్రెండ్‌‌ను సెట్ చేస్తూ వస్తున్నాడు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×