Bellamkonda Sreenivas :బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas).. హిందీలో ‘ఛత్రపతి’ సినిమా డిజాస్టర్ తర్వాత ప్రముఖ హీరోలు నారా రోహిత్ (Nara Rohit), మంచు మనోజ్ (Manchu Manoj) తో కలసి చేస్తున్న చిత్రం ‘భైరవం’. మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని విజయ్ కనకమేడల (Vijay Kanakamedala) దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో సక్సెస్ సాధించిన ‘గరుడన్’ సినిమాను బేస్ చేసుకుని మన నేటివిటీకి తగ్గట్టుగా సినిమాను పూర్తిగా మార్చి విడుదల చేయబోతున్నారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా గుడి, ముగ్గురు స్నేహితుల చుట్టూ సాగే యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం.. నిన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా అటు మంచు మనోజ్ , ఇటు నారా రోహిత్ ఇద్దరూ కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేశారు.
డిజాస్టర్ అని ముందే తెలుసు.. డైరెక్టర్ పై హీరో కామెంట్..
అయితే ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్నారు. అందులో భాగంగానే తాను ఎంతో ఇష్టపడి, కష్టపడి చేసిన ఛత్రపతి సినిమా హిందీలో డిజాస్టర్ అవ్వడానికి గల కారణం డైరెక్టర్ వివి వినాయక్(VV Vinayak) అంటూ సంచలన కామెంట్లు చేశారు. ప్రమోషన్స్ లో భాగంగా ఛత్రపతి సినిమా గురించి ప్రశ్నిస్తూ.. మీరు ఈ సినిమాను ఎంచుకోవడం నాకు కూడా పెద్దగా అనిపించలేదు. మరి మీరేమంటారు అని ఇంటర్వూయర్ ప్రశ్నించగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. “నా జనరేషన్ లో హీరోలంటే రానా, రామ్ చరణ్ తర్వాత మరో తెలుగు హీరో హిందీలో నటించలేదు. అందులో తెలుగు సినిమాని నార్త్ లో డబ్బింగ్ చేస్తే బాగా చూస్తారని అనుకోవడం మా పొరపాటు. ముఖ్యంగా కరోనా సమయంలో ఛత్రపతి సినిమాను నార్త్ ఆడియన్స్ కూడా చూసేశారు. పైగా స్టెప్ బ్రదర్, మదర్ సెంటిమెంట్ చాలావరకు వర్క్ అవుట్ అవుతుంది. అందులోనూ సౌత్ సినిమా కదా నార్త్ లో డబ్బింగ్ చేస్తే చూస్తారు అనుకున్నా.. పైగా రాజమౌళి సినిమాలు నార్త్ ఇండియాలో 100% వర్కౌట్ అవుతాయి.ఆయన ఎమోషన్స్ ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి వర్క్ అవుట్ అవుతాయి. ఇక ఆ సినిమా ప్రొడ్యూసర్ కూడా బ్రదర్, మదర్ సెంటిమెంటు ఎప్పుడు కూడా హిందీలో ఫెయిల్ అవ్వలేదు అంటూ కాన్ఫిడెంట్ ఇచ్చారు. డైరెక్టర్ కూడా నా బ్రెయిన్ వాష్ చేసి ఈ సినిమా హిట్ అవుతుందని చెప్పాడు. దాంతో నేను కూడా అంటే ఇక నమ్మేసి సినిమా చేశాను. కానీ సినిమా చేసేటప్పుడు ఈ సినిమా వర్కౌట్ అవుతుందా..పైగా కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. నిజంగా ఒకవేళ సినిమా తీసినా హిట్ అవ్వదేమో అనే డైలమాలో పడిపోయాను. కానీ సినిమా చేశాను అయితే అది డిజాస్టర్ గా నిలిచింది అంటూ బెల్లంకొండ తెలిపారు.
హీరో పై నెటిజన్స్ ట్రోల్స్..
ఇక ఈ విషయం తెలిసి ఈమధ్య హీరోలకు డైరెక్టర్లపై నింద వేయడం కామన్ అయిపోయింది. అటు ఆచార్య సినిమా డిజాస్టర్ అయినప్పుడు చిరంజీవి (Chiranjeevi )కొరటాల శివ(Koratala Shiva)దే తప్పు అన్నారు. ఇప్పుడు ఛత్రపతి సినిమా డిజాస్టర్ అవడంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా వి.వి.వినాయక్ దే తప్పు అంటున్నారు అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:Samantha-Raj : సమంతతో డైరెక్టర్ రాజ్ ఎఫైర్… కర్మ అంటూ మరోసారి రెస్పాండ్ అయిన భార్య..