Samantha – Raj: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha ), నాగచైతన్య(Naga Chaitanya) వివాహం చేసుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళు వద్దన్నా సరే.. సమంత నటించిన చిత్రం ‘ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2’. ఈ వెబ్ సిరీస్ సమంతకు మంచి పేరు తెచ్చినప్పటికీ.. మునుపెన్నడు నటించని రీతిలో గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వెబ్ సిరీస్ తర్వాతే ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తి నాగచైతన్య, సమంత విడిపోయారు కూడా. అయితే ఇప్పుడు గత కొంతకాలంగా ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ లో ఉందని, రెండో పెళ్లికి సిద్ధమైంది అంటూ వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలో రాజ్ నిడిమోరు భార్య శ్యామలి దే (Shhyamali de) వరుసగా పెడుతున్న పోస్టులు పలు చర్చలకు దారి తీస్తున్నాయి.
సమంత – రాజ్ డేటింగ్ వేళ డైరెక్టర్ భార్య సంచలన పోస్ట్..
మొన్నటికి మొన్న ఒక పోస్ట్ పెట్టి ఆశ్చర్యపరిచిన ఈమె.. ఇప్పుడు మరో పోస్ట్ పెట్టి రూమర్స్ కి ఆజ్యం పోసినట్టు అనిపిస్తోంది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా..”మంచి కర్మను సృష్టించండి. ప్రజలకు సహాయం చేయండి. అందరితో న్యాయంగా వ్యవహరించండి” అంటూ ఇన్స్టా స్టోరీలో పోస్ట్ పెట్టింది. అంతకుముందు..” నా గురించి మాట్లాడేవారికి.. నా తరఫున మాట్లాడేవారికి. నా గురించి వార్తలు వినేవారికి.. నేను చెప్పేది వినేవారికి.. నా గురించి వార్తలు రాసేవారికి.. నాకోసం ఆలోచించే వారందరికీ కూడా దేవుడి ఆశీర్వాదం, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ పోస్ట్ పెట్టింది. ఇకపోతే రాజ్ , సమంత డేటింగ్ రూమర్స్ వేళ ఈమె పెడుతున్న పోస్ట్లు చర్చకు దారితీస్తున్నాయి. వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి ఈమె ఇలాంటి కామెంట్లు చేస్తుందేమో అనే అభిప్రాయాలు కూడా ఆడియన్స్ లో వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికైనా రూమర్స్ ఆగుతాయా..?
ఇకపోతే సమంత ఈమధ్య రాజ్ నిడిమోరుతో ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి తోడు సమంత మయోసైటిస్ వ్యాధి నుంచి కొంతకాలం గ్యాప్ తీసుకొని వచ్చిన “సిటాడెల్ – హనీ బన్నీ” వెబ్ సిరీస్ కి కూడా రాజ్ దర్శకుడు కావడం గమనార్హం. అంతేకాదు ప్రస్తుతం ఈయన దర్శకత్వంలోనే ఈమె ‘రక్త్ బ్రహ్మాండ్ ‘ అనే మరో వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. ఇక మరోవైపు సమంత ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ ను స్థాపించి ‘శుభం’ మూవీని నిర్మించింది. ఈ సినిమా సక్సెస్ లో భాగంగా రాజ్ తో కలిసి దిగిన ఫోటోలను తన ఇన్స్టా లో పోస్ట్ చేయగా.. ఆయనకి ఈమె చాలా క్లోజ్ గా ఉన్నట్లు అనిపించింది. దీంతో డేటింగ్ వార్తలు నిజమేనని అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే మరొకవైపు ఈ వార్తలను సమంత అసిస్టెంట్ ఆర్యన్ ఖండించిన విషయం తెలిసిందే.అయితే ఈ రూమర్స్ ఆగాలి అంటే అటు రాజ్ లేదా ఇటు సమంత ఎవరో ఒకరు స్పందించాలి. కానీ ఈ రూమర్స్ పై వీరు స్పందించకపోవడంతోనే వార్తలు మరింత వేగంగా విస్తరిస్తున్నాయి. మరి దీనిపై ఈ జంట ఎలాంటి కామెంట్లు చేస్తుందో చూడాలి.
ALSO READ:Manchu Manoj : ఎవడున్న లేకున్నా.. మనోజ్‌తో నేను ఉంటా… నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్..!