Hyderabad Crime: హైదరాబాద్ మధురానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. చిట్టి డబ్బులు ఇవ్వాలని భర్తతో కలిసి ఇంటి ఓనర్ పై దాడి చేసారు ఇద్దరు దంపతులు.. అయితే ఆ దాడిలో మహిళపై హేమంత్ అనే వ్యక్తి విచక్షణ రహితంగా దాడి చేసి ఆ మహిళ వేలిని కొరికేసాడు. దీంతో ఆ మహిళ వేలు మొత్తం కట్ అయ్యి కింద పడింది. అక్కడే ఉన్నవారు వెంటనే తనను ఆసుపత్రికి తరలించారు. అయితే డాక్టర్లు ఆ వేలిని అతికించలేమని అని కూడా చెప్పారు. ప్రస్తుతం పోలీసులు హేమంత్‌ను అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ ఘటన మధురానగర్‌లో చోటు చేసుకుంది. ఓ మహిళ చూపుడు వేలిని చిట్టి నిర్వాహకుడు కోరికేసాడు.
Also Read: హైదరాబాద్‌లో ఉగ్రదాడులపై సంచలన ప్రూఫ్స్
జవహార్ నగర్‌కు చెందిన సుజాత ఇంట్లోని పెంట్ హౌస్‌లో 3 సంవత్సరాల నుంచి అద్దెకు ఉంటుంది. అయితే రెంట్‌కు ఉంటున్న హేమంత్, తన భార్య తాగేసి ఇంటికి వచ్చారని ఇంటి ఓనర్స్ పిల్లలు తెలిపారు. అయితే ఓనర్స్ ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి, వాళ్ల అమ్మ కలిసి అదే ఇంట్లో ఉంటున్నారు. ఈ నెల రెంటర్స్ ఇల్లు కాలి చేస్తామని చెప్పారు.. దాంతో 25 కు ఇవ్వాల్సిన చిట్టి డబ్బులు ఇప్పుడు ఇస్తారా లేదా అని వారితో హేమంత్, తన భార్య తాగి గోడవకు దిగారు అని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకుని హేమంత్ ఆ మహిళ ఓనర్ వేలిని కోరికాడు. అయితే ఏదైనా సరే డబ్బుల కోసం ఇంత దారుణంగా వ్యవహారించడం పైన కుటుంబసభ్యులు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. దీంతో పోలీసులు హేమంత్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసుపై పోలీసులు పూర్తి విచారణ చేస్తున్నారు.