BigTV English

Tollywood: ఇదొకటి ఈ మధ్య ప్రమోషన్ లో కామన్ చేశారు.. హిట్టు కోసం ఇంతలా దిగజారాలా.!?

Tollywood: ఇదొకటి ఈ మధ్య ప్రమోషన్ లో కామన్ చేశారు.. హిట్టు కోసం ఇంతలా దిగజారాలా.!?

Tollywood:  తెలుగు సినిమా పరిశ్రమలో ప్రమోషన్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఇటీవల కాలంలో మనం ఎన్నో సినిమా ప్రమోషన్స్ ని చూశాము. ప్రమోషన్స్ లో మూవీ టీం, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్స్, అందరూ పాల్గొని సినిమా గురించి ఆడియన్స్ కి తెలుపుతారు. ఇదంతా ఒకప్పటి ట్రెండ్.ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ప్రమోషన్స్ లో హీరో, హీరోయిన్స్ డాన్స్ చేయడం కాక నిర్మాతలతోనూ, డాన్స్ చేయించడం కొత్తగా చూస్తున్నాం. ఇటీవల సింగిల్ మూవీ ప్రమోషన్స్ లో, అల్లు అరవింద్ డాన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ మూవీ ఎంత హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో మూవీ ప్రమోషన్స్ లో నిర్మాత డాన్స్ చేయడం తో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఆ నిర్మాత ఎవరో చూసేద్దాం..


ఇదొకటి ఈ మధ్య ప్రమోషన్ లో కామన్ చేశారు..

యంగ్ డైరెక్టర్ విజయ్ కనకమెడల దర్శకత్వంలో భైరవం మూవీ రానుంది. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్, నారా రోహిత్, ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను షురూ చేశారు. అందులో భాగంగా ఓ టీవీ ప్రోగ్రాం లో  మూవీ టీం పాల్గొన్నారు. జీ తెలుగు డ్రామా జూనియర్స్ ప్రోగ్రాంకు భైరవం మూవీ టీం విచ్చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా నిర్మాత కేకే రాధా మోహన్ డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతోంది. ఈ వీడియోలో ఆయనతో మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, దర్శకుడు విజయ్ కనకమెడల కలిసి డాన్స్ చేశారు. మిగిలి వారంతా ఉత్సాహంగా డాన్స్ చేస్తున్న నిర్మాత కాస్త ఇబ్బంది పడుతున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది.  వీడియో చూసిన వారంతా, సినిమా ప్రమోషన్స్ లో కొత్తగా ఈ ట్రెండ్ మొదలు పెట్టారని,ఇక సినిమా హిట్ ఖాయం అని  ఫాన్స్ కోమెంట్స్ చేస్తున్నారు. మరికొందరు  సినిమా కోసం మరీ ఇంతలా దిగజారాలా అని కామెంట్స్ చేస్తున్నారు.


ఆ హీరోలకు ఈ చిత్రం కీలకం..

ఇక సినిమా హిట్ కావాలంటే కంటెంట్ ముఖ్యం, కానీ ఇప్పుడు ప్రమోషన్స్ ముఖ్యమనే భావన పరిశ్రమలో పెరుగుతుంది.గతంలో సినిమా ప్రమోషన్స్ అంటే ట్రైలర్ , పోస్టరు, ఆడియో లాంచ్, మీడియా ఇంటర్వ్యూలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు అదంతా మారిపోయింది.  ఇక భైరవం మూవీలో నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ హీరోలుగా నటిస్తున్నారు. అతిథి శంకర్, దివ్య పిళ్లె, ఆనంది హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ముఖ్య పాత్రలో జయసుధ నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంగీతాన్ని శ్రీ చరణ్ అందించారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందించారు. భైరవం తమిళ సూపర్ హిట్ చిత్రం గరుడన్ కు రీమేక్ గా రానుంది. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా, ముగ్గురు అన్నదమ్ముల కథగా రూపొందించారు. ఈ సినిమా కోసం ముగ్గురు హీరోలు ఎంతో కష్టపడ్డారని విజయ కనక మెడల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మంచు మనోజ్ కాలికి గాయం అవడం, లెక్క చేయకుండా ఆయన షూటింగ్లో పాల్గొనడం, నారా రోహిత్ కు ఫ్యామిలీలో విషాదం నెలకొన్న ఆయన షూటింగ్ ఆపకుండా కొనసాగించారని దర్శకుడు తెలిపారు. ఎప్పటినుంచో హిట్ కోసం ఎదురు చూస్తున్న ముగ్గురు హీరోలకు ఈ సినిమా కీలకంగా మారనుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×