BigTV English
Advertisement

Bhairavam: గరుడన్ రీమేక్.. ఊర మాస్ లుక్ లో బెల్లంకొండ హీరో.. శివ తాండవమే

Bhairavam: గరుడన్ రీమేక్.. ఊర మాస్ లుక్ లో బెల్లంకొండ హీరో.. శివ తాండవమే

Bhairavam: ఈ మధ్యకాలంలో మళ్లీ రీమేక్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. తెలుగులోవి హిందీలో.. తమిళ్ లోవి తెలుగులో రీమేక్ చేస్తున్నారు. కథ నచ్చాలే కానీ, అది రీమేక్ నా.. ? లేక డబ్బింగ్ నా.. ? అనేది ప్రేక్షకులు చూడడం లేదు. దీంతో మేకర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ.. ఒక మంచి కథను ప్రేక్షకులకు అందివ్వడానికి ముందు ఉంటున్నారు. తాజాగా కోలీవుడ్ మంచి విజయాన్ని అందుకున్న ఒక సినిమాను.. తెలుగులో రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్.


కోలీవుడ్  కమెడియన్ సూరి.. హీరోగా మారి మంచి మంచి కథలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న విషయం తెల్సిందే. సూరి హీరోగా నటించిన చిత్రాల్లో గరుడన్ కూడా ఒకటి. ఈ ఏడాది మే లో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇక సూరితో పాటు మరో ఇద్దరు హీరోలు కూడా ఇందులో నటించారు. వారే శశి కుమార్, ఉన్ని ముకుందన్.ముగ్గురు స్నేహితులుగా కథగా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

Baby John Teaser Cut: బేబీ జాన్ టీజర్.. ఒక్క షాట్ కే పరిమితమైన మహానటి


నాంది సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ విజయ్ కనకమేడల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోలుగా నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్  నటిస్తున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వచ్చాయి. తాజాగా నేడు ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ రివీల్ చేస్తూ.. బెల్లంకొండ శ్రీనివాస్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భైరవం అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలిపారు.

ఇక బెల్లకొండ శ్రీనివాస్  ఊర మాస్ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. గరుడన్ లో సూరి నటించిన పాత్రలో శ్రీనివాస్ కనిపించనున్నట్లు తెలుస్తోంది.  బెల్లంకొండ శ్రీనివాస్ శ్రీను అనే పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.

గుడి ముందు.. ఒక చేతిలో త్రిశూలం.. ఇంకోచేతిలో కొడవలి పట్టుకొని.. ఒంటినిండా రకటంతో.. సీరియస్ గా చూస్తూ బెల్లంకొండ శ్రీనివాస్ కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. చాలా గ్యాప్ తరువాత శ్రీనివాస్ ఈ సినిమాతో రాబోతున్నాడు. మరి ఈ చిత్రంతో ఈ కుర్ర హీరోలు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×