BigTV English

Baby John Teaser Cut: బేబీ జాన్ టీజర్.. ఒక్క షాట్ కే పరిమితమైన మహానటి

Baby John Teaser Cut: బేబీ జాన్ టీజర్.. ఒక్క షాట్ కే పరిమితమైన మహానటి

Baby John Teaser Cut: మహానటి కీర్తి సురేష్  బాలీవుడ్  ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో విజయ్ నటించిన తేరి సినిమాను హిందీలో బేబీ జాన్ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ ఈ చిత్రంలో విజయ్ పాత్రను పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమాతోనే కీర్తి బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది. దీనికోసం అమ్మడు ఎంతగానో ఎదురుచూస్తుంది. ఒకప్పుడు గ్లామర్ పాత్రలకు నో చెప్పిన ఈ మహానటి.. ఇప్పుడు బేబీ జాన్ కోసం గ్లామర్ ను ఒలకబోసింది.


జవాన్ సినిమాతో డైరెక్టర్ గా హిందీలో అడుగుపెట్టిన అట్లీ.. బేబీ జాన్ సినిమాతో నిర్మాతగా మారాడు. జియో స్టూడియోస్ సమర్పణలో ఏ ఫర్ యాపిల్ ప్రొడక్షన్స్, సినీ1 స్టూడియోస్‌ బ్యానర్స్ పై ప్రియా అట్లీ, మురాద్ ఖేతాని, జ్యోతి దేస్ పాండే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అట్లీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కాలిస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే బేబీ జాన్ నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Mithun Chakraborty: బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తి ఇంట తీవ్ర విషాదం..


ఇక తాజాగా నేడు ఈ సినిమా టీజర్ కట్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. తేరి సినిమాను మక్కీకి మక్కీ దింపేసినట్లు తెలుస్తుంది. విజయ్ పాత్రలో వరుణ్ ధావన్ జీవించేశాడు. టీజర్ మొత్తం అతనికి ఎలివేషన్ ఇచ్చే డైలాగ్స్ తోనే సరిపెట్టేశారు. ” చీమ ఒంటరిగా ఉంటే ఈజీగా నలిపేయవచ్చు.. కానీ అన్ని చీమలు గుంపులుగా ఒకేచోట ఏకమైతే ఏనుగును కూడా పడగొట్టగలవు” అని చిన్నపాప చెప్పే డైలాగ్ తో టీజర్ ను మొదలుపెట్టారు. ఫుల్ యాక్షన్ సన్నివేశాలు చూపిస్తూ వరుణ్ ను పవర్ ఫుల్ పోలీసాఫీసర్ లుక్ లో రివీల్ చేసిన తీరు ఆకట్టుకుంది.

ఇక  రెండు విభిన్నమైన గెటప్స్ లో వరుణ్ కనిపించి మెప్పించాడు. పోలీస్ గా ఉన్నప్పుడు పర్ఫెక్ట్ హెయిర్ కట్ తో కనిపించిన వరుణ్.. కూతురుతో ఉన్నప్పుడు లాంగ్ హెయిర్  తో కనిపించాడు. టీజర్ అంతా ఒక ఎత్తు అయితే థమన్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక  ఒక నిమిషం 56 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ మొత్తంలో కీర్తి ఒకే ఒక్క షాట్ లో మాత్రమే కనిపించింది.

Pushpa 2 : 6 భారీ ఈవెంట్లు… “పుష్ప 2″కు రాజమౌళి స్ట్రాటజీ ఫాలో అవుతున్న సుక్కు

తేరిలో సమంత నటించిన పాత్రలో  ఇప్పుడు కీర్తి కనిపిస్తుండగా.. అమీ జాక్సన్ నటించిన పాత్రను వామిక గబ్బీ పోషిస్తుంది. నిజం చెప్పాలంటే.. చాలామంది ఈ సినిమాను కేవలం కీర్తి సురేష్ కోసమే ఈ రీమేక్ ను చూడడానికి ఎదురుచూస్తున్నారు. టీజర్ లోనే అమ్మడు ఒక్క షాట్ లో కనిపిస్తే.. సినిమాలో ఒక్క సాంగ్ లోనే ఆమెను వరుణ్ ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం చూపించి ఆ పాత్రను చంపేయలేదు కదా.. అలా అయితే అమ్మడు హీరోయిన్ గా కాదు గెస్ట్ రోల్ చేసినట్లే అని చెప్పుకుంటున్నారు. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 25 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  మరి ఈ సినిమాతో కీర్తి సురేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×