BigTV English
Advertisement

Bhairavam Twitter Review: ‘ భైరవం ‘ మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే..?

Bhairavam Twitter Review: ‘ భైరవం ‘ మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే..?

Bhairavam Twitter Review: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోలైన మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ముగ్గురు కలిసి నటించిన లేటెస్ట్ చిత్రం భైరవం.. ఈ చిత్రాన్ని రాధా మోహన్ నిర్మించారు. గత నెలరోజులుగా భైరవం చిత్ర యూనిట్ ఒక రేంజ్ లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ చిత్రానికి బజ్ తీసుకునివచ్చారు. ప్రేక్షకులంతా ఇది మంచు మనోజ్ కి కంబ్యాక్ మూవీ కావాలని కోరుకుంటున్నారు. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో వచ్చిన ఈ లేటెస్ట్ చిత్రం ఇవాళ భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసింది. ఇటీవల ఈ ముగ్గురికి సరైన చిత్రాలు లేవు. ఇక ఈ చిత్రం కోసం ముగ్గురు హీరోలు ప్రాణం పెట్టేశారు.. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ఇవాళ థియేటర్లలోకి వచ్చేసింది.. మరి ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ ఎలా ఉంది? నెటిజెన్లు ఎలా రియాక్ట్ అయ్యారో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


ఈ మూవీలోని ప్రతి సీను భూస్వంత్ తెప్పించేలా ఉందని ప్రమోషన్స్లో మేకప్స్ పదేపదే చెప్తూ వచ్చారు.. అంతేకాదు ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్లు, ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్లలో మంచు మనోజ్ స్పీచ్ హైలెట్గా మారింది. ఎంత చూస్తుంటే సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంటుందని మూవీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ఇవాళ థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఎలాంటి టాక్ని సొంతం చేసుకుందో ఒకసారి ఇక్కడ చూసేద్దాం..

భైరవం సినిమా కథ ఎక్సలెంట్. కానీ అనవసరమైన ఫైట్లు, ఎలివేషన్ ఆ ఫ్లేవర్‌ను దెబ్బ తీశాయి. భారీ హిట్‌గా మారేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. మనోజ్, రోహిత్ బాగా నటించారు. నాకు ఫస్టాఫ్ నచ్చింది. సెకండాఫ్ అంతగా నచ్చలేదు. పాటలు అవసరం లేదనిపించింది. మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేదు.. ఓ నెటిజను కామెంట్ చేశాడు..


భైరవం సినిమా సోకాల్డ్ రస్టిక్ యాక్షన్ డ్రామా. ఫస్టాఫ్ అంతంత మాత్రంగానే ఉంది. సెకండాఫ్‌లో కొన్ని అంశాలు బాగున్నప్పటికీ.. తొలి భాగంలో ఎస్టాబ్లిష్ అయిన అంశాలను బలంగా మార్చుకోలేకపోయింది.. సినిమాలో ముగ్గురు హీరోలు నటించారు కదా బాగానే ఉంది. అక్కడక్కడ తేలిపోయిందని అనిపిస్తుంది. సాఫీగా సాగుతున్న సమయంలో లవ్ ట్రాక్లు, అలాగే పాటలు ఈ సినిమాకి అడ్డుకట్ట వేసినట్లు అనిపిస్తున్నాయంటూ మరో నెటిజను ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు..

ఈ సినిమా కి బలం కథ, నటన కానీ వీళ్ళు అవి తగ్గించి హీరో ఎలివేషన్ ఫైట్స్ మీద కాన్సంట్రేట్ చేశారు, 1st హాఫ్ కొంచెం బాగున్న, 2nd హాఫ్ పెద్ద ఫైట్స్ చేసి పెద్ద హీరో అయిపోదాం అన్న ఆవేశం తో కనిపించాడు.. తనకైతే పర్వాలేదని టాక్ ని సొంతం చేసుకున్నాడని కామెంట్ చేశాడు..

మొత్తానికైతే ఈ సినిమాకు ఒక విధంగా పాజిటివ్ టాక్ వచ్చినా కూడా.. అటు లవ్ స్టోరీ, పాటలు ఈ సినిమాకి పెద్ద మైనస్ అయ్యాయని నెటిజన్లు ట్విట్టర్ ద్వారా కామెంట్లు పెడుతున్నారు.. ఏమైనా కూడా స్టోరీ బాగుందని టాక్ మాత్రం సినిమాకు ఊపునిచ్చిందని చెప్పాలి. ప్రస్తుతానికి ఈ మూవీకి మిక్సీ్డ్ టాక్ వచ్చింది. ఇక కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×