E-Paper
Advertisement

Manchu Family Issue: గొడవలపై మంచు లక్ష్మి ఇన్‌డైరెక్ట్ పోస్ట్.. లైక్ కొట్టిన మనోజ్ భార్య

Manchu Family Issue: గొడవలపై మంచు లక్ష్మి ఇన్‌డైరెక్ట్ పోస్ట్.. లైక్ కొట్టిన మనోజ్ భార్య
Advertisement

Manchu Family Issue: మంచు కుటుంబంలో ఇంత జరుగుతున్నా మంచు లక్ష్మి ముందుకొచ్చి ఈ విషయంపై స్పందించకపోవడంపై అనేక అనుమానాలు వినిపిస్తున్నాయి. ఎలాంటి పరిస్థితి వచ్చినా తన తమ్ముడికి సపోర్ట్ చేస్తూనే ఉంటానని చెప్పిన లక్ష్మి.. ఇంత జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉంది అనే విషయం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈ గొడవలు జరుగుతున్న సమయంలో మంచు లక్ష్మి మీడియా ముందుకు రాకపోయినా దీనిని ఉద్దేశించినట్టుగానే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది. ఈ గొడవలపై తాను ఈ పోస్ట్‌తో ఇన్‌డైరెక్ట్‌గా స్పందిస్తుందేమో అని అనుమానాలు కలుగుతున్న సమయంలోనే మంచు మనోజ్ భార్య భూమా మౌనిక.. దీనికి లైక్ కొట్టింది.

సోషల్ మీడియాలోనే స్పందన

Advertisement

తాజాగా మంచు లక్ష్మి తన కూతురు వీడియోను షేర్ చేస్తూ.. దానికి ‘పీస్’ అనే క్యాప్షన్‌ను జతచేసింది. ఈ సందర్భంలో తనకు పీస్ కావాలని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పకనే చెప్తోంది మంచు లక్ష్మి. ఇంతకంటే దీనిపై తాను స్పందించనని కూడా ఈ పోస్ట్‌తోనే చెప్పేస్తుందేమో అని నెటిజన్లు అనుమానిస్తున్నారు. ఇదే సమయంలో ఈ పోస్ట్‌కు భూమా మౌనిక లైక్ కొట్టడం మరొక ఆసక్తికర విషయంగా మారింది. ఇంత గొడవ జరుగుతున్నప్పుడు మంచు లక్ష్మి ఆ పోస్ట్ ఏంటో.? దానికి మనోజ్ భార్య లైక్ కొట్టడమేంటో? అని మరికొందరు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి మనోజ్‌తో కలిసి తన భార్య భూమా మౌనిక కూడా మంచు ఫ్యామిలీపై సీరియస్‌గా ఉంది.

Also Read: పీస్ కోసం మంచు లక్ష్మి కష్టాలు.. ఇన్‌స్టాలో పోస్ట్ వైరల్

Advertisement

దగ్గరుండి పెళ్లి చేసింది

మంచు మనోజ్ (Manchu Manoj).. భూమా మౌనిక (Bhuma Mounika)ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి తన కుటుంబంలో తగాదాలు మొదలయ్యాయి. ఇరు కుటుంబాల సపోర్ట్ లేకపోవడంతో చాలాకాలం పాటు తమ ప్రేమను పెళ్లిగా మార్చకుండా ఆగిపోయింది ఈ జంట. కానీ మొత్తానికి మంచు ఫ్యామిలీ నుండి లక్ష్మి సపోర్ట్ అందడంతో మనోజ్, మౌనిక పెళ్లి పీటలెక్కారు. ఆ పెళ్లికి కూడా మంచు ఫ్యామిలీ నుండి ఎవ్వరూ రాలేదు. మంచు లక్ష్మి మాత్రమే పెళ్లి పెద్దగా మారి వీరి వివాహం జరిపించింది. ఎలాంటి సందర్భంలో అయినా మంచు మనోజ్‌కు తన సపోర్ట్ ఉంటుందని చెప్పిన లక్ష్మి.. ఇంత జరుగుతున్నా, తన తమ్ముడిని ఇంట్లోకి రానివ్వకుండా ఉన్నా కూడా బయటికి వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు.

నో కాంప్రమైజ్

మంచు ఫ్యామిలీలో జరుగుతుతున్న గొడవలపై మంచు లక్ష్మి (Manchu Lakshmi) స్పందన గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదట్లో మోహన్ బాబుకు కూడా ఈ విషయంపై ఓపెన్‌గా స్పందించడం ఇష్టం లేకపోయినా.. పరిస్థితి చేయి దాటిపోవడంతో అసలు వివాదాన్ని వివరిస్తూ ఒక వాయిస్ మెసేజ్‌ను విడుదల చేశారు. ఆ తర్వాత మంచు విష్ణు కూడా మీడియా ముందుకు వచ్చి ఈ విషయంపై వివరణ ఇచ్చారు. వీరి స్పందనలో అంతా కూల్‌గానే అనిపించినా.. మంచు మనోజ్‌తో కాంప్రమైజ్ అయ్యే విషయంలో మాత్రం మోహన్ బాబు (Mohan Babu), విష్ణు వెనక్కి తగ్గుతున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×