Manchu Family Issue: ప్రస్తుతం సోషల్ మీడియాలో, టీవీల్లో ఎక్కడ చూసినా మంచు ఫ్యామిలీ వివాదం గురించే వార్తలు వినిపిస్తున్నాయి. ఒక చిన్న కుటుంబ సమస్య ఇంత పెద్దగా మారి అన్నదమ్ములు, తండ్రీకొడుకుల బంధాన్నే దూరం చేసుకునేంత వరకు వెళ్లింది. మంచు ఫ్యామిలీలో ఒకవైపు మోహన్ బాబు స్టేట్‌మెంట్, మరొకవైపు మంచు విష్ణు స్టేట్‌మెంట్.. ఇవన్నీ చూస్తుంటే మనోజ్‌తో కాంప్రమైజ్ అయ్యేలాగానే ఉన్నా వారి ప్రవర్తన మాత్రం అలా లేదు. ఇంత జరుగుతున్నా కూడా మంచు మనోజ్‌కు సపోర్ట్‌గా మంచు లక్ష్మి ఏమీ మాట్లాడకపోవడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ సమయంలోనే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పీస్ అంటూ ఒక పోస్ట్ షేర్ చేసింది లక్ష్మి.
మొత్తానికి స్పందించింది
మోహన్ బాబు (Mohan Babu)కు, మంచు మనోజ్ (Manchu Manoj)కు గొడవ జరిగిందనే విషయం తెలియగానే వెంటనే అక్కడికి చేరుకుంది మంచు లక్ష్మి. తండ్రీకొడుకులను కాంప్రమైజ్ చేయడానికి లక్ష్మి ప్రయత్నిస్తుందని వినడమే తప్పా నిజంగానే ఆ ఇంట్లో ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. ముఖ్యంగా మీడియా ముందుకు వచ్చి మంచు లక్ష్మి తన స్పందన ఇవ్వకపోవడంపై సందేహాలు మొదలయ్యాయి. తను ఎందుకిలా చేస్తుంది, ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదని ప్రేక్షకులు చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇప్పటికీ మోహన్ బాబు, మంచు విష్ణు సైతం ఈ గొడవ గురించి ఓపెన్‌గా మాట్లాడారు. కానీ మంచు లక్ష్మి మాత్రం ఈ గొడవల మధ్యలో ఒక పోస్ట్ పెట్టి మ్యాటర్‌ను ముగించినట్టు అనిపిస్తోంది.
Also Read: జర్నలిస్ట్ పై మోహన్ బాబు దాడి… వివాదానికి ఆజ్యం పోసిన విష్ణు కామెంట్స్
పోస్ట్‌కు కామెంట్స్
ఒకవైపు తన కుటుంబంలో ఇన్ని గొడవలు జరుగుతున్నా.. మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూతురి వీడియో షేర్ చేస్తూ ‘పీస్’ అనే క్యాప్షన్ పెట్టింది. అంటే తనకు మనశ్శాంతి కావాలని అనుకుంటుందా లేదా తన కుటుంబం కలిసిపోయి అంతా బాగుండాలని కోరుకుంటుందా.. అసలు ఈ పోస్ట్ వెనుక అర్థమేంటి అని చాలామంది నెటిజన్లు అర్థం చేసుకోలేకపోతున్నారు. చాలావరకు నెటిజన్లంతా అసలు మంచు కుటుంబంలో ఏం జరుగుతుందో అడుగుతూ ఈ పోస్ట్‌కు తెగ కామెంట్స్ పెడుతున్నారు. మంచు మనోజ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్తూ ఉండే లక్ష్మి.. నేరుగా ఈ విషయంపై స్పందిస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కాంప్రమైజ్ చేయలేదా?
తన అన్నదమ్ముల్లో తనకు మంచు మనోజ్ అంటేనే చాలా ఇష్టమని, తనకు మనోజ్ చాలా క్లోజ్ అని ఎన్నోసార్లు ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చింది మంచు లక్ష్మి (Manchu Lakshmi). మనోజ్ లేకపోతే ఇళ్లంతా ఒకలాగా ఉంటుందని చెప్పుకొచ్చింది. తనకు తన కూతురు ఎలాగో, మనోజ్ కూడా అంతే అని కూడా తన తమ్ముడిపై ప్రేమను బయటపెట్టింది. అలాంటి మంచు లక్ష్మి.. ఇలాంటి కష్ట సమయంలో తమ్ముడికి తోడుగా లేకపోవడమేంటి అని అందరూ మాట్లాడుకుంటున్నారు. తను కాంప్రమైజ్ చేయాలని ప్రయత్నించినా తన కుటుంబం వినలేదా లేదా తను అసలు కాంప్రమైజ్ చేయడానికే ట్రై చేయలేదా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ విషయంపై మంచు లక్ష్మి స్పందన కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు.