BigTV English

Bichagadu 2 review: బిచ్చగాడు 2.. ఈసారి హిట్టా? ఫట్టా?

Bichagadu 2 review: బిచ్చగాడు 2.. ఈసారి హిట్టా? ఫట్టా?


Bichagadu 2 review: బిచ్చగాడు. ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో తెలుసు. ఒకేసారి వచ్చిన శ్రీమంతుడు బిచ్చగాడు అయితే.. బిచ్చగాడుని శ్రీమంతుడుని చేసింది! ఆ సినిమాతో విజయ్ ఆంటోనీ ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయారు. చాన్నాళ్ల బ్రేక్ తర్వాత మళ్లీ బిచ్చగాడు 2తో ముందుకొచ్చాడు. హీరో, సంగీతం, ఎడిటింగ్, నిర్మాత, బ్యానర్, దర్శకత్వం.. అన్నీ విజయ్ ఆంటోనీనే. మరి, బిచ్చగాడిలానే బిచ్చగాడు 2 మెప్పించిందా?

స్టోరీ: దేశంలోనే టాప్ బిజినెస్ మేన్‌ విజయ్‌ గురుమూర్తి (విజయ్‌ ఆంటోని). అతని ఫ్రెండ్ అరవింద్ ( దేవ్ గిల్) అదే సంస్థలో ఉంటూ.. మరికొందరితో కలిసి విజయ్ ఆస్థి కొట్టేసేందుకు కుట్ర చేస్తాడు. అందుకోసం అరవింద్ వేసిన ఎత్తుగడ వెరైటీగా ఉంటుంది. విజయ్ గురుమూర్తి మెదడును.. సత్య (విజయ్ ఆంటోనీ) అనే బిచ్చగాడి మెదడుతో రీప్లేస్ చేయిస్తాడు. మరోవైపు, సత్యది ఇంకో స్టోరీ. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతారు. చెల్లి తప్పిపోతుంది. ఆమె కోసం వెతుకుతున్న సమయంలోనే అరవింద్ కుట్రతో సత్య మెదడు విజయ్ గురుమూర్తికి అమర్చబడుతుంది. ఆ తర్వాత ఏమైందనేది అసలు స్టోరీ. తప్పిపోయిన చెల్లిని కనిపెట్టే ప్రయత్నం.. పేదల కోసం యాంటీ బికిలీ మాల్.. మధ్యలో పొలిటికల్ ఛాలెంజెస్.. ఇలా కథను అటూఇటూ తిప్పారు. అదంతా థియేటర్లలో చూడాల్సిందే.


బిచ్చగాడు స్టోరీకి.. బిచ్చగాడు 2 కథకు ఏమాత్రం సంబంధం లేదు. అది అమ్మ సెంటిమెంట్ అయితే.. ఇది చెల్లి సెంటిమెంట్. అయితే, స్టోరీ మొదటి సినిమా మాదిరి ఓ టెంపోలో సాగదు. చెల్లి సెంటిమెంటూ అంతంతమాత్రమే. ఫస్ట్ హాఫ్ ‘ఇస్మార్ట్ శంకర్’ని గుర్తు చేస్తుంది. బ్రెయిన్‌ ట్రాన్‌ప్లాంటేషన్‌ ఎపిసోడ్‌ను ఆసక్తికరంగానే మలిచారు. ‘చెల్లి వినవే’ సాంగ్ బాగుంది. అరవింద్ అండ్ గ్యాంగ్‌ను చంపే ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ మెప్పిస్తోంది. ఫస్ట్ హాఫ్ బానే ఉందనిపిస్తుంది. బ్రేక్ తర్వాత.. ఇక స్టోరీ అదుపు తప్పుతుంది. సెకండాఫ్‌ సామాజిక సేవ.. హీరో ప్రసంగాలు.. బిచ్చగాడి వేషం.. పేద ప్రజలకు సహాయం చేసేందుకు ‘యాంటి బికిలీ’ మాల్‌ ప్రారంభించడం.. ఇదంతా కాస్త ఓపికగా చూడాల్సి వస్తుంది. ఇక, సత్యకు చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి క్యారెక్టర్ రావడంతో కథ మళ్లీ ఆసక్తి రేపుతుంది. రౌడీలతో ఫైటింగ్ సీన్స్ బాగుంటాయ్. ఎమోషనల్ క్లైమాక్స్‌తో ఎండ్ కార్డ్ పడుతుంది.

విజయ్ యాక్టింగ్, మ్యూజిక్, యాక్షన్ సీన్స్, ఎమోషన్స్, క్లైమాక్స్.. బిచ్చగాడు 2కి కలిసొచ్చే అంశాలు. సెకండాఫ్ ఇంకాస్త జాగ్రత్తగా తీసుంటే.. ‘బిచ్చగాడు’లా హిట్ కొట్టుండేది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×