BigTV English

Chat GPT : రేడియోలజీ ఎగ్జామ్ రాసిన చాట్‌జీపీటీ.. రిజల్ట్ ఏంటంటే..?

Chat GPT : రేడియోలజీ ఎగ్జామ్ రాసిన చాట్‌జీపీటీ.. రిజల్ట్ ఏంటంటే..?


Chat GPT : ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) సామర్థ్యంతో తయారయిన చాట్‌జీపీటీ అనేది ఇప్పటికీ అన్ని రంగాల్లో బెస్ట్ అని నిరూపించుకుంది. పలు రంగాల్లో తన టాలెంట్ చూపించడానికి చాట్‌జీపీటీ కాస్త తడబడినా.. టెక్ పరిశోధకులు వెంటనే దానిని మెరుగుపరిచే పనిలో పడ్డారు. చాట్‌జీపీటీకి ప్రపంచవ్యాప్తంగా పెరిగిన క్రేజ్‌ను చూసి దానికి లేటెస్ట్ వర్షన్‌ను కూడా తయారు చేశారు. తాజాగా ఈ లేటెస్ట్ చాట్‌జీపీటీ వర్షన్ మెడికల్ ఎగ్జామ్‌ను పాస్ అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ముందుగా చాట్‌జీపీటీ అనేది టెక్నాలజీ రంగం వరకే పరిమితం అనుకున్నారు. కానీ మెల్లగా ఇది అన్ని రంగాల్లోనూ తన సత్తాను చాటుకుంటూ ముందుకెళ్తోంది. అనూహ్యంగా మెడికల్ రంగంలో కూడా తనకు ఎదురులేదని చాట్‌జీపీటీ ఇప్పటికే నిరూపించింది. ఇప్పటికే ఇది పలు సర్జరీలలో పాల్గొనడం, పలువురు మానసిక రోగులకు థెరపిస్ట్‌గా పనిచేయడం లాంటివి కూడా జరిగాయి. తాజాగా రేడియోలజీలో కూడా చాట్‌జీపీటీ తన టాలెంట్ ఏంటో మరోసారి నిరూపించుకుంది. రేడియోలజీలో బోర్డ్ ఎగ్జామ్‌ను పాస్ అయ్యి చూపించింది.


పేషెంట్లకు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉంది అని ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా తెలుసుకోవడమే రేడియోలజీ. దీనికి సంబంధించిన బోర్డ్ ఎగ్జామ్‌లో చాట్‌జీపీటీ పాస్ అయినా కూడా ఇంకా కొన్ని తప్పులు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. అయినా అవి పెద్ద పొరపాటులు కావని, మొత్తంగా చూసుకుంటే చాట్‌జీపీటీ రేడియోలజీ ఎగ్జామ్‌లో పాస్ అయినట్టే అని వారు అంటున్నారు. మెడికల్ రంగంలో చాట్‌జీపీటీని పూర్తిగా నమ్మడం కష్టమని చెప్తున్నారు వైద్యులు. ఎందుకంటే చాట్‌జీపీటీ ఇచ్చే సమాధానాలు ఒక్కొక్కసారి పేషెంట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉన్నాయన్నారు.

ఎన్ని విమర్శలు వినిపిస్తున్నా కూడా మెడికల్ రంగంలోని కొన్ని విభాగాల్లో చాట్‌జీపీటీ వినియోగం మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం చాట్‌జీపీటీ 3.5 వర్షన్ అనేది ఎక్కువగా వినియోగంలో ఉంది. ముందుగా రేడియోలజీ ఎగ్జామ్ అనేది ఈ వర్షన్‌కే పరీక్షించారు. ఈ పరీక్షలో 150 చాయిస్ ప్రశ్నలను అడిగారు. ప్రతీ ప్రశ్నకు చాట్‌జీపీటీ సమాధానం ఎలా ఉంది, దానికి ఎంత సమర్థవంతంగా జవాబు చెప్తుంది లాంటి వివరాలను కూడా వైద్యులు గమనించి చూశారు.

రేడియోలజీ ఎగ్జామ్‌లో జీపీటీ 3.5 వర్షన్ 69 శాతం ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పి 70 శాతం మార్కులను సంపాదించుకుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. అదే విధంగా ఇటీవల మార్క్‌లో విడుదల అయిన జీపీటీ 4 వర్షన్‌కు కూడా రేడియాలజీ పరీక్షలు నిర్వహించారు. ఇందులో జీపీటీ 4.. 81 శాతం సరిగ్గా సమాధానాలు చెప్పిందని వైద్యులు బయటపెట్టారు. మొత్తంగా చూస్తే రేడియోలజీ బోర్డ్ ఎగ్జామ్‌లో జీపీటీ 3.5, జీపీటీ 4 వర్షన్స్ పర్ఫార్మెన్స్ దాదాపుగా ఒకేలాగా ఉందని వైద్యులు చెప్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×