BigTV English

Pallavi Prashanth Arrest Updates : ఆరోజు సంఘటనకి అతడే కారణం .. బిగ్ బాస్ విన్నర్ పై డీసీపీ క్లారిటీ..

Pallavi Prashanth Arrest Updates : ఆరోజు సంఘటనకి అతడే కారణం .. బిగ్ బాస్ విన్నర్ పై డీసీపీ క్లారిటీ..
Pallavi Prashanth Arrest Updates

Pallavi Prashanth Arrest Updates : పల్లవి ప్రశాంత్ .. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఇతను ఎన్ని కాంట్రవర్సీలకు కారణమై పాపులర్ అయ్యాడో .. హౌస్ లో నుంచి వచ్చిన వెంటనే కూడా అదే రకంగా పెద్ద కాంట్రవర్సీకి కారణమయ్యాడు. బిగ్ బాస్ ఫినాలే ముగిసిన రోజు రాత్రి జరిగిన ఘర్షణలో తెలంగాణ ఆర్టీసీ కు సంబంధించిన ఆరు బస్సులు ,కొన్ని పోలీసు వాహనాలు, ప్రైవేటు వాహనాలు తీవ్రంగా నష్టపోయాయి. అలాగే ఈ ఘటనలో కొంతమంది పోలీసులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . దీనికి కారణం ఎవరు అన్న విషయంపై పోలీసులు స్పష్టత ఇచ్చారు.


పరోక్షంగా ఈ ఘర్షణలు తలెత్తడానికి పల్లవి ప్రశాంత్ కారణం అని ఆరోపిస్తున్నారు పోలీసులు. అందుకే బిగ్ బాస్ ‘7’ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్టు అయిన్నప్పటి నుంచి ఈ విషయంలో చాలామందికి డౌట్స్ ఉండడంతో డీసీపీ విజయ్ మీడియాతో మాట్లాడుతూ జరిగిన విషయాలను వివరించారు . పల్లవి ప్రశాంత్ విజేతగా ప్రకటించిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర అతని అభిమానులు హంగామా చేశారు. సెక్యూరిటీ ఇష్యూ అవుతుంది కాబట్టి అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందిగా పోలీసులు ముందుగానే పల్లవి ప్రశాంతకు సూచించారు.

కానీ పల్లవి ప్రశాంత్ పోలీసుల చెప్పిన విధంగా ఆచరించలేదు. ముందుకు వెళ్లి మళ్లీ వెనక్కి తిరిగి వచ్చాడు. ఎక్కువమంది గుమి కూడడంతో అనవసరంగా ఘర్షణ తలెత్తడానికి ఆస్కారం దొరికింది. ఈ విధంగా ఆరోజు జరిగిన ఘర్షణకు అతడే కారణమని గుర్తించినట్లు తెలిపారు. అందుకే అతనిపై ఈ ఘటనకు సంబంధించి రెండు కేసులను నమోదు చేశారు. మొదటి కేసులో పల్లవి ప్రశాంతతో పాటు ముగ్గురును అరెస్టు చేశామని ఇక అందులో ఒక వ్యక్తి పరారీలో ఉన్నారని.. ఇక రెండవ కేసులో ఇప్పటికే 16 మందిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.


ఇక ఆ విషయం పక్కన పెడితే ఇప్పటివరకు బిగ్ బాస్ ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. కానీ ఏ సీజన్లో కూడా ఇంత రచ్చ జరిగింది లేదు. ఎంతోమంది సెలబ్రిటీలు బిగ్ బాస్ లో పాల్గొన్నారు.. బయటకు వచ్చాక తమ పని తాము చేసుకున్నారే తప్ప ఈ విధంగా లొల్లి చేసిన వాళ్ళు ఎవరూ లేరు. మొదటిసారి పల్లవి ప్రశాంత్ ఇలాంటి రచ్చ సృష్టించి బిగ్ బాస్ పరువు  తీసిన ఏకైక మొనగాడు గా మిగిలిపోయాడు. ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు అతను ప్రవర్తించిన తీరు ఎలా ఉందో స్పష్టంగా చూపించే వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతని కేసు విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×