BigTV English

Bigboss Season 8: సీజన్‌8 కి బిగ్‌ బాస్ రెడీ, ఈసారి కంటెస్టెంట్‌లు ఎవరంటే..?

Bigboss Season 8: సీజన్‌8 కి బిగ్‌ బాస్ రెడీ, ఈసారి కంటెస్టెంట్‌లు ఎవరంటే..?

Big Boss Telugu Season 8 Latest Updates: టాలీవుడ్‌లో బిగ్‌బాస్ సీజన్ అనగానే తెలుగు ఆడియెన్స్ ఎప్పుడెప్పుడు చూద్ధామా అంటూ ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు.ఎందుకంటే బిగ్‌బాస్ స్టార్ట్ అయిన సీజన్ నుండి బిగ్‌బాస్‌కి ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. మొదట్లో ఎక్కడో స్టార్ట్ అయిన ఈ షో.. తర్వాత తెలుగు,కన్నడ, హిందీ వంటి భాషల్లో స్టార్ట్ అయింది. అంతేకాదు ఆడియెన్స్ నుండి మంచి ఆధరణని సంపాదించుకుంది. అది కన్నడ, హిందీ, తెలుగు అయినా సరే మంచి రేటింగ్‌తో అదరగొట్టేసింది. ఇక టాలీవుడ్ మ్యాటర్‌కి వస్తే.. ఇక్కడి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు వచ్చిన సీజన్స్‌ని విజయవంతంగా పూర్తి చేసుకొని 8వ సీజన్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. అంతేకాదు రిలీజైన అన్ని సీజన్స్‌కి మంచి రేటింగ్‌తో దూసుకుపోతున్నాయి. రానున్న 8వ సీజన్ మీద తెలుగు ఆడియెన్స్‌లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొంటున్నాయి. అంతేకాదు గతంలో అన్ని షోలకి టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించాడు.


ఈసారి నటసామ్రాట్ ఆడియెన్స్ అంచనాలకు అనుగుణంగా సరికొత్తగా బిగ్‌బాస్ షోని ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ బిగ్‌బాస్ షో కోసం తెలుగు ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనాలకు కొత్త అనుభూతిని పంచేలా గతంలో మాదిరిగానే ఎలిమినేషన్స్, టాస్క్‌లు గేమ్‌లోని రూల్స్, కంటెస్టెంట్స్ ఆడే ఆటలు ఉండనున్నాయని బిగ్‌బాస్ ఫ్యాన్స్ తెగ ఉవ్విళ్లూరుతున్నారు. అంతేకాదు ఈ షోలో ఇంకేమన్నా యాడ్ చేసి ఆడియెన్స్‌కి వినోదాన్ని పంచనున్నారా అంటూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Also Read: కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ అంటూ న్యాచురల్ హీరో ఎంట్రీ


అంతేకాదు ఈ షో దాదాపుగా 50 రోజులకు పైగా బిగ్‌బాస్ సీజన్ 8 రాబోతుందట. 2024లో రాబోయే రెండు నెలల్లో అంటే సెప్టెంబర్ 1న ఆదివారం గ్రాండ్‌గా లాంఛ్‌ ఈవెంట్‌కి భారీగా ప్లాన్ చేయనున్నట్లు టాక్. అంతేకాదు ఈ సీజన్‌లో కంటెస్టెంట్‌ ఎవరనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎవరి అంఛనాలను మించని.. కంటెస్టెంట్లు ఈ సీజన్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారట. అందులో ముఖ్యంగా యూట్యూబ్లో స్టార్‌గా మారిపోయిన రోడ్డు సైడ్ పుడ్‌ పెట్టే కుమారీ ఆంటీ, యూట్యూబ్ రీల్స్ చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసిన బర్రెలక్క, యూట్యూబర్ బంచిక్ బబ్లూ, టాలీవుడ్‌ నటీనటులు సురేఖా వాణి, హేమ,రీతూ చౌదరి, అమృత ప్రణయ్, వర్షిణి, క్రికెటర్ అంబటి రాయుడు,వేణుస్వామి, బుల్లెట్ భాస్కర్, కిరాక్ ఆర్పీ, సుందరరాజన్ తదితరులు ఈ షోలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ సీజన్‌లో పార్టీస్‌పేట్ చేసే వారంతా చిన్న స్థాయి నుంచి పెద్ధ రేంజ్‌కి వెళ్లిపోయిన వ్యక్తులే కావడంతో ఆడియెన్స్‌లో ఎప్పుడెప్పుడు చూద్ధాం. ఎప్పుడు బిగ్‌బాస్ సీజన్ 8 ప్రారంభం కానుందనే క్యూరియాసిటీ నెలకొంది. మరి చూడాలి బిగ్‌బాస్‌లో ఈసారైనా బూతులు లేకుండా సాఫీగా నడుస్తుందో లేక ఎప్పటిలాగే బిగ్‌బాస్ లింక్‌లు పెట్టి గంధరగోళం సృష్టించనున్నారో. అన్నట్లు గత ఏడాది టైటిల్ విన్నర్‌గా గెలుపొందిన పల్లవి ప్రశాంత్ విషయంలో కొంత గంధరగోళం జరిగింది. గెలుచుకున్న అమౌంట్ అంతా పంచి పెడుతానని చెప్పి మాట తప్పాడని తనపై అప్పట్లో చాలా వ్యతిరేకత ఏర్పడింది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×