OTT Movie : చిన్నపిల్లలు ఎక్కువగా యానిమేషన్ సినిమాలను ఇష్టపడుతుంటారు. ఆ తర్వాత ఎక్కువగా మార్వెల్ యాక్షన్ సినిమాలను ఇష్టపడతారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే చైనీస్ మూవీ చిన్న పిల్లల్ని బాగా ఆకట్టుకుంది. ఏలియన్ రూపంలో ఉండే ఒక చిన్న కుక్క పిల్ల, డిక్కీ అనే ఒక చిన్న పిల్లాడి చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ చైనీస్ సైన్స్ ఫిక్షన్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ చైనీస్ సైన్స్ ఫిక్షన్ మూవీ పేరు ‘సి జే సెవెన్’ (CJ7). చైనీస్ సైన్స్ ఫిక్షన్ కామెడీ డ్రామా మూవీకి స్టీఫెన్ చౌ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ జనవరి 31, 2008న హాంకాంగ్‌లో థియేటర్లలో విడుదలైంది. ఇది చైనా విజయవంతమైన షెన్‌జౌ క్రూడ్ స్పేస్ మిషన్ పేరుతో చిత్రీకరించారు. CJ7 చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని నింగ్‌బోలో చిత్రీకరించబడింది. ఒక పేద విద్యార్థి జీవితంలోకి ఒక చిన్న ఏలియన్ వస్తుంది. ఆతరువాత అతని జీవితం మారిపోతుంది. ఆ ఏలియన్ పిల్ల చేసే విన్యాసాలతో మూవీ సరదాగా ఉంటుంది. చిన్నపిల్లలు ఈ మూవీని బాగా ఇస్టపడతారు. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
డిక్కీ స్కూల్ కి వెళ్లి చదువుకుంటూ ఉంటాడు. ఇతని తండ్రి కన్స్ట్రక్షన్ కంపెనీలో ఒక లేబర్గా పనిచేస్తుంటాడు. తల్లి చనిపోవడంతో తండ్రి డిక్కీని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. స్కూల్లో ఇతన్ని పిల్లలు తరచుగా ఆట పట్టిస్తుంటారు. పేదవాడు కావడంతో సరిగ్గా బట్టలు కూడా ఉండవు. ఒక బొమ్మని కొనమని తండ్రిని అడగడంతో, డబ్బులు లేక అతన్ని సైలెంట్ గా ఉండమంటాడు. అందుకు ఆ పిల్లవాడు చాలా బాధపడతాడు. ఈ క్రమంలో ఒకసారి ఆకాశం నుంచి ఒక వస్తువు కిందపడుతుంది. దానిని తీసుకొని డిక్కికి ఇస్తాడు తండ్రి. అదే ఒక చిన్న లబ్బర్ బాల్ లాగా ఉంటుంది. అయితే అది కొంతసేపటికి ఒక చిన్న కుక్క పిల్లలా మారిపోతుంది. అది మరో గ్రహం నుంచి వచ్చిన ఒక ఏలియన్ పిల్ల. దాని తల్లి దండ్రుల నుంచి తప్పిపోయి ఉంటుంది. దానితో ఆడుకుంటూ డిక్కీ చాలా సరదాగా ఉంటాడు. స్కూల్లో తనని ఏడిపించిన పిల్లల్ని డిక్కీ తో గుణపాఠం చెప్పిస్తాడు. ఇలా సరదాగా సాగిపోతున్న సమయంలో, ఏలియన్ తల్లిదండ్రులు తను ఎక్కడుందో గుర్తిస్తారు. చివరికి తల్లిదండ్రుల దగ్గరికి ఏలియన్ వెళ్ళవలసి వస్తుంది. ఆ చిన్న ఏలియన్ డిక్కీని వదిలి వెళ్తుందా? డిక్కీ లైఫ్ తర్వాత ఏ విధంగా ఉంటుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సి జే సెవెన్’ (CJ7) అనే ఈ చైనీస్ సైన్స్ ఫిక్షన్ మూవీని చూడాల్సిందే.