BIG TV Kissik Talks: మౌనరాగం, జానకి కలగనలేదు వంటి సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ప్రియాంక జైన్ (Priyanka Jain) తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా ప్రచారం అవుతున్న ‘కిస్సిక్ టాక్ షో’ కి ముఖ్యఅతిథిగా విచ్చేసింది. ఈ కార్యక్రమానికి జబర్దస్త్ బ్యూటీ వర్ష (Varsha) హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రియాంక జైన్ తన డ్రెస్ సెన్స్ పై చేసిన కామెంట్లకు ఒక్కసారిగా కౌంటర్ ఇచ్చింది. ఏదైనా ఒక పని పాట ఉండే వారికి ఇవన్నీ పట్టవు. అలా ఏమి లేని వారే చేతిలో ఫోన్ ఉంది కదా.. ఐడి ఉంది కదా అని వెంటనే ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తారు. అవతల వ్యక్తి ఈ కామెంట్ల వల్ల బాధపడతారు అని ఆలోచన కూడా ఉండదు అంటూ తనదైన శైలిలో షాకింగ్ కామెంట్లు చేసింది.
ట్రోల్స్ కి తట్టుకోలేకపోయాను..
అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ప్రియాంక జైన్ ఆహా ఓటీటీ వేదికగా డాన్స్ ఐకాన్ సీజన్ 2 కి తన కంటెస్టెంట్ తో వెళ్ళింది. అక్కడ బ్లాక్ కలర్ వన్ పీస్ డ్రెస్ వేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ డ్రెస్ వేసుకోవడంపై నెటిజన్స్ రకరకాల ట్రోల్స్ చేశారు. ఆమెపై అసభ్యకర కామెంట్లు కూడా చేశారు.ఆ సమయంలో ఒక్కసారిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట. అయితే తన ప్రియుడు శివ మాత్రం వీటన్నింటినీ వదిలేయ్.. ఎవరు నిన్ను ఈ కామెంట్స్ చూడమని చెప్పారు. నువ్వు నీకేంటో తెలుసు కదా.. నువ్వు ఎక్కడ ఎలా ఉన్నావు. అది మాత్రమే ఆలోచించు. ఇలా డ్రెస్ సెన్స్ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసే వాళ్ల గురించి పట్టించుకోవద్దు అని అండగా నిలిచారు అంటూ ప్రియాంక తెలిపింది.
ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన ప్రియాంక జైన్..
ఇక దీనిపై ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇస్తూ అసలు నాకు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో బాగా తెలుసు. అయినా నాకు ఫ్యాషన్ ట్రై చేయడం చాలా ఇష్టం. ఒక్కొక్కసారి హ్యాలోవీన్ మేకప్ ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటాను. నాకు నచ్చిన డ్రెస్ నేను వేసుకున్నాను. అంతేతప్ప మొత్తం 2 పీస్ వేసుకొని ఎక్స్పోజ్ చేయలేదు కదా.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఐడి ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు. ఒక గోల్ ఉంటే ఇలాంటివి ఎవరూ పట్టించుకోరు. అలా ఏ పని పాట లేని వారే ఇలాంటి కామెంట్లు చేస్తారు.. అయినా ఒక అమ్మాయి గురించి ఇలా తప్పుడు మాటలు మాట్లాడేలా ఇంతకు దిగజారుతారా అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది. అంతేకాదు అమ్మాయిని, అబ్బాయిని సమానంగా చూడడం నేర్చుకోవాలని అప్పుడే సమాజం బాగుపడుతుంది అంటూ కూడా తన మనసులో మాటగా చెప్పుకొచ్చింది ప్రియాంక జైన్. మొత్తానికైతే తనపై వచ్చిన ట్రోల్స్ కి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
ALSO READ:Big TV Kissik Talks: అలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ప్రియాంక.. ట్రోల్స్ పై ఎమోషనల్..!