Harsh Dubey – suyash sharma : సాధారణంగా ఐపీఎల్ లో రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని వింత సంఘటనలు, వైరల్ సంఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో వింత ఘటన చోటు చేసుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కి చెందిన హర్ష్ దూబే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ సూయాష్ శర్మ ఆడారు. అయితే వీరిద్దరూ ఒకేలా ఉన్నట్టు కనిపించారు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. వీరి ఫేస్ కట్లు ఒకేలా ఉన్నాయి. వీరిద్దరూ అన్నదమ్ములా ఏంటి..? అని చాలా మంది పేర్కొంటున్నారు. కొందరూ సోషల్ మీడియాలో హర్ష్ దూబే..సూయాష్ శర్మ అన్నదమ్ములా మాదిరిగా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : MI – Superman : కొత్త జెర్సీలో ముంబై ఇండియన్స్..ఇక పై అందరూ సూపర్ మాన్స్
మరోవైపు ఆర్సీబీ కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో అరుదైన ఘనత సాధించాడు. టీ-20 క్రికెట్ లో ఒకే జట్టు తరపున 800 ఫోర్లు కొట్టిన తల్లి ఆటగాడిగా విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. టీ-20 క్రికెట్ లో ఒకే జట్టు తరపున 800 ఫోర్లు కొట్టిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ.. వరల్డ్ రికార్డు సృష్టించాడు.ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. కోహ్లీ ఇప్పటివరకు ఆర్సీబీ తరపున 801 ఫోర్లు బాదాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ 25 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు.. ఓ సిక్సర్ సాయంతో 43 పరుగులు చేశాడు. ఇక ఈ రేర్ ఫిట్ సాధించిన జాబితాలో ఇంగ్లండ్ ఆటగాడు జేమ్స్ విన్స్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. విన్ హాంప్ షైర్ క్రికెట్ క్లబ్ తరపున ఆడి ఈ ఫీట్ సాధించాడు.
ఇక మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ కి సన్ రైజర్స్ హైదరాబాద్ ఝలక్ ఇచ్చింది. బెంగళూరు పై 45 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు సాధించాడు. ఇషాన్ కిషన్ 94 నాటౌట్,. టాప్ స్కోరర్ గా నిలిచాడు. అభిషేక్ శర్మ 34, అనికేత్ వర్మ 26, క్లాసెన్ 24 కీలక ఇన్నిఆడారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఆర్సీబీ జట్టు 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే ఓపెనర్లు సాల్ట్ 62, విరాట్ కోహ్లీ 43 పరుగులు చేశారు. వీరు ఆడుతున్న ఆటను చూసి ప్రారంభంలో ఆర్సీబీ విజయంధిస్తుందని అంతా భావించారు. కానీ చివరలో ఆర్సీబీ బ్యాటర్లు చేతులెత్తేయడం.. హైదరాబాద్ జట్టు బౌలర్లు ధాటిగా బౌలింగ్ చేయడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. మరోవైపు లక్నో వేదికలో లక్నో సూపర్ జెయింట్స్ తో ఆర్సీబీ తలపడనుంది.
— Out Of Context Cricket (@GemsOfCricket) May 23, 2025