Mani Ratnam: రోజులు మారుతున్న కొద్దీ కొన్ని సినిమాలను చూసే విధానం కూడా మారిపోతుంది. అందుకే కొన్ని సినిమాలు అప్పట్లో హిట్ కాకపోయినా ఇప్పుడు రీ రిలీజ్ లో బ్లాక్ బస్టర్ హిట్లయిపోతున్నాయి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోతున్నాయి. కానీ అవే సినిమాలను కొంతమంది చూసినప్పుడు ఇంత మంచి సినిమా ఎందుకు డిజాస్టర్ చేశారు అని మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ వేసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెయిల్ ఇయర్ అంటూ ఉంటుంటారు. ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో ఒక సినిమా హిట్ నిర్ణయించేది కేవలం కలెక్షన్స్ అని అందరికీ ఒక స్థాయి నమ్మకం వచ్చేసింది. అందుకే చాలామంది నిర్మాతలు సినిమా రిలీజ్ అయిన మరుక్షణమే కలెక్షన్ పోస్టర్ రిలీజ్ చేస్తూ ఉంటారు.
అది అసలైన సినిమా సక్సెస్
ఒకప్పుడు సినిమా రిలీజ్ అయితే అది పెద్ద సినిమా అయితే దానికి సంబంధించిన టిక్కెట్లు దొరకడమే గగనం అయిపోయేది. ఇప్పుడు ఆన్లైన్లో టికెట్లు దొరుకుతున్నాయి కానీ ఒకప్పుడు థియేటర్ కు వెళ్లి టికెట్ తీసుకోవాలి. ఒక సినిమా హిట్ అయితే అది ఎన్ని రోజులు ఆడింది అనే దాని పైన ఆ సినిమా సక్సెస్ ఒకప్పుడు డిపెండ్ అయి ఉండేది. 50 రోజులు ఎన్ని సెంటర్లు, వంద రోజులు ఎన్ని సెంటర్లు అని డిస్కషన్ జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఎంత కలెక్ట్ చేసింది అని మాత్రమే మాట్లాడుతున్నారు. ఇప్పుడు అంతా కూడా 1000 కోట్లు మార్కెట్ దాటి పోతేనే అది ఒక బ్లాక్ బస్టర్ సినిమాగా పరిగణిస్తున్నారు. దీనిపైన లవ్ గురు మణిరత్నం రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో స్పందించారు.
క్వాలిటీ సినిమా కావాలా, కలెక్షన్స్ కావాలా.?
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటికే 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చిన సినిమాలు ఉన్నాయి. అయితే తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు 1000 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసిన సినిమా రాలేదు. దీని గురించి మణిరత్నం కి ప్రశ్న ఎదురయింది. దానికి సమాధానంగా మణిరత్నం మాట్లాడుతూ ఒకప్పుడు సినిమా క్వాలిటీ మాత్రం ఆడియన్స్ చూసేవాళ్ళు. ఇప్పుడు ఆడియన్స్ అంతా కూడా కలెక్షన్స్ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ముందు సినిమా క్వాలిటీ ఉంటే అది బాగుంటే ఆటోమేటిక్ గా కలెక్షన్స్ వస్తాయంటూ మణిరత్నం 1000 కోట్ల సినిమాలు పైన తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక మణిరత్నం కమలహాసన్ దర్శకత్వంలో వస్తున్న థగ్ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి.
Also Read : Game Changer: దర్శకుడు శంకర్ కి మరీ అంత నిర్లక్ష్యమా.?