Big TV Kissik Talks:ప్రముఖ జబర్దస్త్ (Jabardast) లేడీ కమెడియన్ వర్ష (Varsha) తాజాగా హోస్ట్గా వ్యవహరిస్తున్న షో ‘కిస్సిక్స్ టాక్స్’.. బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా ప్రసారమవుతున్న ఈ షో ద్వారా ఎంతోమంది సెలబ్రిటీలు హాజరవుతూ తమ కెరియర్లో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను అలాగే ఫ్యూచర్లో తాము ఏం చేయబోతున్నాం ఇలా పలు విషయాలపై స్పందిస్తూ.. అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ఈ షో ప్రారంభమై కొద్దిరోజులే అవుతున్నా అటు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచింది. ఇకపోతే ఎప్పటిలాగే ఈ వారం పూర్తి ఎపిసోడ్ ను తాజాగా నిర్వాహకులు విడుదల చేయగా అందులో ఈసారి చీఫ్ గెస్ట్ గా బిగ్ బాస్ బ్యూటీ ప్రముఖ సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్ (Priyanka Jain) పాల్గొన్నారు. అందులో భాగంగానే తనకు అనారోగ్య సమస్య ఉందని, ఆ సమస్య కారణంగానే అత్యధిక బరువు పెరిగిపోయాను అంటూ తెలిపింది.
మౌనరాగం సీరియల్ సమయంలో అనారోగ్య బారిన పడ్డ – ప్రియాంక జైన్
అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న డ్యాన్స్ ఐకాన్ షోలో బ్లాక్ డ్రెస్ లో కనిపించి కాస్త ట్రోల్స్ ఎదుర్కొంది. ఆ ట్రోల్స్ కి కన్నీరు కూడా పెట్టుకుంది. అయితే బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన తర్వాతే ప్రియాంక జైన్ లో ఇలాంటి మార్పు వచ్చింది అని చాలామంది విమర్శలు గుప్పించారు. ఇక దీనిపై ప్రశ్న ఎదురుగా ఆమె మాట్లాడుతూ..” నేను బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన తర్వాత మారిపోయాను అంటున్నారు. అసలు నేను ఏం మారలేదు. ప్రస్తుతం ఉన్నదే నేను. ప్రతిసారి ఒక కొత్త ఫ్యాషన్ ప్రయత్నం చేయాలని అనుకుంటూ ఉంటాను. అయితే బిగ్బాస్ కి వెళ్ళకముందు కూడా ఇలాగే ట్రై చేయాలని ఉండేది. కానీ సీరియల్స్ లో నా పాత్రల వల్ల నేను ఇలాంటి డ్రెస్సులు వేసుకోలేకపోయాను. మౌనరాగం సీరియల్ చేసేటప్పుడు మరింత ఇబ్బంది పడ్డాను. ముఖ్యంగా ఈ సీరియల్ ఒకేసారి తెలుగు, తమిళ్లో షూటింగ్ జరుగుతుండేది. తెలుగులో షూటింగ్ పూర్తిచేసుకుని నైట్ మళ్లీ చెన్నైకి వెళ్లి అక్కడ తమిళ్ మౌనరాగం షూటింగ్లో పాల్గొనాల్సి వచ్చేది. అలా దాదాపు 8 నెలల పాటు తీరిక లేకుండా శ్రమించాను. అమ్మ వాళ్ళ ఇంటికి కూడా దూరమయ్యాను. ఒక్కొక్కసారి అరటిపండు, నీళ్లు తాగి కూడా పడుకున్నా రోజులు ఉన్నాయి.ఇక్కడ ఫ్లైట్ ఎక్కడం అక్కడి దిగడం.. మళ్ళీ అక్కడ ఫ్లైట్ ఎక్కడం.. ఇక్కడ దిగడం ఇలా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఫలితం నా ఆరోగ్యం పై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. నిద్ర లేకపోవడం, సరిగ్గా తిండి తినకపోవడం వంటి కారణాలవల్ల నేను హైపో థైరాయిడ్ బారిన పడ్డాను.
ALSO READ:Producers Meet : చర్చలు మళ్లీ వాయిదా… ఈ పంచాయితీకి ఇక పరిష్కారం లేదా..?
బిగ్ బాస్ కి వెళ్ళాకే దాని నుంచి బయటపడ్డా – ప్రియాంక జైన్
దీని కారణంగా చిన్ మొత్తం పెరిగిపోయింది. శరీరం కూడా బరువు పెరిగింది. ఆ సమయంలో నా శరీరానికి తగ్గట్టుగా మాత్రమే నేను దుస్తులు వేసుకోగలను కదా. అప్పుడు చీరలు, చాలా సాంప్రదాయంగా బాడీకి అనుకూలంగా ఉండే డ్రస్సులు మాత్రమే వేసుకున్నాను. ఇక బిగ్ బాస్ లోకి వెళ్లిన తర్వాత అక్కడ స్ట్రెస్ కారణంగా నేను క్రమంగా బరువు తగ్గుతూ వచ్చాను. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మౌనరాగం సీరియల్ కి ముందు ఎలా ఉండేదాన్ని ..ఆ తర్వాత కూడా అలాగే తయారయ్యాను.. ఇప్పుడు నా ఆరోగ్యం కుదుటపడింది అంటూ తెలిపింది. అయితే అనారోగ్య సమస్యలు గురించి పట్టించుకోకుండా.. నా ఆలోచనల గురించి ఏమాత్రం ఆలోచన లేకుండా ట్రోల్స్ చేయడంతో కన్నీళ్లు ఆగలేదు అంటూ ఎమోషనల్ అయింది.