BigTV English

DSSSB: ఈ అర్హత ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు.. నెలకు రూ.1,50,000 జీతం బ్రో.. డోంట్ మిస్

DSSSB: ఈ అర్హత ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు.. నెలకు రూ.1,50,000 జీతం బ్రో.. డోంట్ మిస్

DSSSB Recruitment:  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నంచే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది సూపర్ న్యూస్ అని చెప్పవచ్చు. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు, ఢిల్లీ ఎన్సీటీ ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉన్న వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి. టెన్త్ లేదా ఇంటర్ లేదా ఏదైనా డిగ్రీ, బీఈడీ, బీఏ, బీటెక్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (డీఎస్ఎస్ఎస్‌బీ) లో 2119 అసిస్టెంట్, వార్డర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. ఆగస్టు 7న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 2119


ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డులో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో అసిస్టెంట్, వార్డర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి టెన్త్, ఇంటర్, ఏదైనా డిగ్రీ, బీఈ, బీఈడీ, బీఎస్సీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జులై 8

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఆగస్టు 7

దరఖాస్తు ఫీజు: అప్లై చేసుకునే అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.

వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. మలేరియా ఇన్ స్పెక్టర్ కు 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. పీజీటీ ఇంగ్లిష్ ఉద్యోగానికి 30 ఏళ్ల వయస్సు మించరాదు. ఇలా ఉద్యోగాన్ని బట్టి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్ డ్ టెస్ట్ ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. జనరల్ అవేర్ నెస్, రీజినింగ్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ లాంగ్వేజ్ స్కిల్స్ పై ఎంసీక్యూలతో వన్ టైర్ ఎగ్జామ్ ఉంటుంది. టెక్నికల్, టీచింగ్ పోస్టులకు సెక్షన్ ఏ, సెక్షన్ బీ ఎగ్జామ్ ఉంటుంది.

జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు రావాలి. ఓబీసీ అభ్యర్థులకు 35 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 30 శాతం మార్కులు రావాలి. మాజీ సైనికులకు వారి సంబంధిత వర్గాలలో 5 శాతం సడలింపు మంజూరు చేయబడుతోంది.

జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. ఉద్యోగాన్ని బట్టి రూ.19,900 నుంచి రూ.1,51,100 జీతం ఉంటుంది.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి. దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం కొట్టండి. ఆల్ ది బెస్ట్.

అఫీషియల్ వెబ్ సైట్: https://dsssb.delhi.gov.in/

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 2119

దరఖాస్తుకు చివరి తేది: ఆగస్ట్ 7

ALSO READ: MTS notification: 1075 ఉద్యోగాలకు అప్లై చేశారా..? రేపే లాస్ట్ డేట్ భయ్యా..

Related News

IOCL Jobs: పదో తరగతి అర్హతతో భారీగా జాబ్స్.. మంచి వేతనం.. 2 రోజులే గడువు

Prasar Bharati: ప్రసార భారతిలో ఉద్యోగాలు.. అక్షరాల రూ.80,000 జీతం.. ఈ అర్హత ఉంటే చాలు

DSSSB: ఇంటర్ అర్హతతో భారీగా జాబ్స్.. తక్కువ పోటీ.. వెంటనే అప్లై చేయండి బ్రో

ESIC Jobs: ఈఎస్ఐసీలో 243 ఉద్యోగాలు.. రూ.2,08,700 జీతం, దరఖాస్తుకు ఇంకా 2 రోజులే సమయం

DDA Recruitment: నిరుద్యోగులకు శుభవార్త.. డీడీఏలో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్, పూర్తి వివరాలివే

Jobs in RRB: రైల్వేలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు.. రూ.35,400 జీతం.. ఇంకెందుకు ఆలస్యం

Airport Authority of India: ఇది అద్భుమైన అవకాశం.. ఎయిర్‌పోర్టుల్లో భారీగా ఉద్యోగాలు, లక్షల్లో జీతాలు బ్రో

State Bank of India: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హత ఉంటే చాలు

Big Stories

×